గిరిజన అవుట్‌ సోర్సింగ్‌ టీచర్ల మెరుపు ఆందోళన

Published on Tue, 07/14/2026 - 04:09

సాక్షి, అమరావతి: ఉద్యోగ భద్రత కోసం మెరుపు ఆందో­ళనకు దిగిన గిరిజన అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం రోడ్డుపై బైఠాయించిన వీరిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఈడ్చిపడేశారు. భారీగా మోహరించిన పోలీసులు ఈ టీచర్లను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. పోలీసులతో జరిగిన పెనుగులాటలో పలువురు మహిళా టీచర్లు సొమ్మసిల్లిపడిపోయారు.

దీంతో తోటి టీచర్లు వారికి సపర్యలు చేశారు. అయినా కనికరం చూపని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమపట్ల నిర్దయగా వ్యవహరిస్తోందని, తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఆందోళన విరమించేదిలేదని అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గిరిజన అవుట్‌ సోర్సింగ్‌ టీచర్స్‌ యూనియన్‌ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 191 గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 1,143 అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ చంద్రబాబు, లోకేశ్, సంధ్యారాణి ఎన్నికల ముందు హామీలు గుప్పించారని గుర్తుచేశారు. 

అధికారంలోకి వచ్చిన అనంతరం డీఎస్సీలో తమ పోస్టులు రద్దుకావడంతో విధుల నుంచి తొలగించకుండా తమను ప్రత్యామ్నాయ పోస్టుల్లో నియమిస్తామంటూ నమ్మబలికారని చెప్పారు. అయితే, ఈ ఏడాది వేసవి శెలవుల అనంతరం ఇప్పటివరకు తమను రెన్యువల్‌ (రెగ్యులర్‌) చేయకపోవడంతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదన్నారు. దీంతో తాడేపల్లి గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద గత నెలాఖరున మూడు రోజులపాటు రాత్రిపగలు నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గతనెల 23న మంత్రి చర్చలకు పిలిచి అవమానించారని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే కుటుంబాలతో సహా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపడతామని వారు అల్టిమేటం ఇచ్చారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)