Breaking News

యాత్ర పేరిట నయవంచన

Published on Wed, 06/25/2025 - 05:15

తెనాలి: పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది యాత్రికుల నుంచి డబ్బు వసూలు చేసిన నిర్వాహకుడు వారిని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయా­డు. దీంతో వారంతా నానాఅగచాట్లు పడ్డారు. ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని నానా బాధలు పడుతూ సొంత ఊళ్లు చేరుకున్నారు. తమను అవస్థలు పెట్టిన ట్రావెల్స్‌ నిర్వా­హకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్నారు. మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. 

తెనాలిలోని శ్రీ అరుణాచలేశ్వర, మణికంఠ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ నిర్వాహకుడు ఎం.గురుమూర్తి మొత్తం 260 మందిని సరస్వతీ నది పుష్కరాల యాత్ర, కేదార్‌నాథ్‌ దర్శనానికి తీసుకెళ్లేందుకు వసూలు చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.22 వేల నుంచి రూ.34 వేల వరకు రూజ85 లక్షల వరకు తీసుకున్నారు. పర్వతం మీదుండే కేదార్‌నా«థ్‌ ఆలయానికి హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ఆసక్తి చూపిన వారి నుంచి అదనంగా రూ.15 వేలు వసూలు చేశారు. ప్రయాణికులు భోజనం, వసతి సహా అన్నింటికీ డబ్బులు ముందుగానే చెల్లించారు. 

యాత్రికులంతా రాష్ట్రంలోని గుంటూరు, చీరాల, ఒంగోలు, విజయవాడ, భీమవ­రం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు చెందిన వారే. విజ­య­వాడ నుంచి ఢిల్లీ వరకు రైలు ప్రయాణం, అక్కణ్నుంచి హరిద్వార్‌కు బస్సు అని చెప్పారు. మొత్తం 15 రోజుల యాత్ర. ప్రణాళిక ప్రకారం యాత్రికులు మే 17వ తేదీన రైలు­లో ఢిల్లీ చేరుకున్నారు. అక్కణ్నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లో 18వ తేదీకి హరిద్వార్‌ చేరుకున్నారు. 19వ తేదీ ఉదయం ప్రయాణానికి సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్లిన నిర్వా­హకుడు గురుమూర్తి ఆ తర్వాత కనిపించలేదు. ఫోన్‌ స్విచాఫ్‌లో ఉంది. దీంతో చేతిలో డబ్బుల్లేనివారు నానా అవస్థలు పడ్డారు.

ఇళ్లకు ఫోన్లు చేసి డబ్బులు తెప్పించుకుని కేదా­ర్‌నాథ్‌ ఆలయా­న్ని దర్శించుకుని ఇంటికి చేరినవారు కొందరుంటే, చాలా­­మంది యాత్రను కొనసాగించలేక తిరుగుముఖం ప­ట్టా­రు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితులు స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఆ ట్రా­వెల్‌ ఆఫీస్‌ టూటౌన్‌ పరిధిలోనిదని అక్కడికెళ్లి ఫిర్యాదు చేయాలని, లేద­ంటే ఎవరి ఊళ్లో వారు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. దీంతో వారంతా మీడియాతో తమ బాధను వెల్లడించారు.

హరిద్వార్‌ తీసుకెళ్లి వదిలేశాడు
సరస్వతీ నది పుష్కరాలు, కేదార్‌నా«థ్‌ యాత్ర అంటే ఒకేసారి రెండు అవకాశాలు రావటం అదృష్టమన్న భావనలో గురుమూర్తి అడిగినంత డబ్బు ఇచ్చి బయల్దేరాం. ఢిల్లీకి, అక్కణ్నుంచి హరిద్వార్‌కు తీసుకెళ్లి వదిలేశాడు. ఇప్పటికీ ఆచూకీ తెలియటం లేదు. బాధ్యుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.    – దుర్గాప్రసాద్, చీరాల 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)