Breaking News

ఫైనాన్స్‌ దా‘రుణం’.. ఇల్లాలు బలవన్మరణం

Published on Thu, 04/10/2025 - 05:58

భట్టిప్రోలు (కొల్లూరు): ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ ఆగడాలు మితిమీరి ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్ప­డటంతో అవమాన భారం భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో బాణావత్‌ గోవింద్‌నాయక్‌ భార్య పార్వతిబాయ్‌ (44)తో కలసి నివసిస్తున్నాడు. వీరు అమాయకులు. పెద్దగా చదువు రాదు. 

గతేడాది వీరు 5 స్టార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలో ఇంటి పత్రాలు తనఖా పెట్టి రూ.4 లక్షలు రుణం తీసుకున్నారు. రుణం మంజూరు చేసే సమయంలో రూ.లక్ష చార్జీలంటూ వసూలు చేసి, రూ.3 లక్షలు అందజేశారు. అప్పట్నుంచి లోన్‌ నగదు చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొంత కాలం తర్వాత తమ ఇంటిని ఫైనాన్స్‌ సంస్థ వారు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలియడంతో నెలవారీ కిస్తీలు కట్టడం ఆపేసి.. ఆ విషయం తేల్చాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సంస్థ ప్రతినిధులు పార్వతీబాయ్‌ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యం చేయడంతోపాటు, దుర్భాషలాడారు. దీంతో వారు భట్టిప్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఈ విషయంపై మంగళవారం సాయంత్రం ప్రైవేటు పైనాన్స్‌ సంస్థకు చెందిన వ్యక్తులు పార్వతిబాయ్‌ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యానికి పాల్ప­డ్డారు. సామగ్రి బయటకు విసిరేశారు. వంట పాత్రలతో ఆమెపై దాడికి తెగబడ్డారు. కేసు వాపసు తీసుకోవాలంటూ తీవ్రంగా హెచ్చరించి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన పార్వతీబాయ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు తలుపులు తీసి.. ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల ఆగడాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బాధిత కు­టుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)