Breaking News

అప్పు ఇచ్చిన వ్యక్తి పంట తీసుకెళ్లడంతో..కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

Published on Mon, 12/30/2024 - 03:50

నకరికల్లు: అప్పు తీర్చలేదని తాను పండించిన పంటను అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకెళ్లడంతో అవమానభారం తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన కౌలు రైతు చెన్నంశెట్టి కోటేశ్వరరావు  కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా రెండెకరాల్లో సాగు చేశాడు. వరుస నష్టాలతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు భారంగా మారాయి.

ఒక ఎరువుల దుకాణంలో పంటకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.2 లక్షలకు చేరింది. అప్పును తీర్చేందుకుగాను 95 బస్తాలకు పైగా ధాన్యం, మరోవైపు రూ.50 వేల నగదు దశలవారీగా చెల్లించినా ఇంకా బాకీ మిగిలి ఉంది. కాగా, శుక్రవారం వరి పంట నూర్పిడి చేయగా వచ్చిన మొత్తం 80 ధాన్యం బస్తాలను దుకాణదారుడు తన గుమస్తాను పంపి తీసుకెళ్లాడు. దీంతో కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)