Breaking News

చావడానికే వచ్చాం.. ఎవరూ కాపాడొద్దు

Published on Mon, 12/29/2025 - 04:17

గడివేముల: ఇద్దరు బిడ్డలు.. ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. కానీ విధి చిన్నచూపు చూసింది. ఇద్దరు బిడ్డలను అనారోగ్యం వెంటాడింది. దీంతో ఆ తల్లి మనసు తల్లడిల్లింది. చిన్నారులు ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అని చెప్పి.. మధ్యలోనే దిగి ఇద్దరు బిడ్డలను కాలువలో తోసి తానూ దూకేసిన∙విషాద ఘటన నంద్యాల జిల్లా గడివేముల మండలంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగానిపల్లె ఎల్లా లక్ష్మి (23)ని అదే గ్రామానికి చెందిన రమణయ్య నాలుగేళ్ల్ల కిందట వివాహం చేసుకున్నారు. 

వీరికి ఇద్దరు కుమార్తెలు వైష్ణవి (2), సంగీత (మూడునెలలు) ఉన్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లగా రక్తకణాలు తగ్గిపోయాయని, గడివేములకు వెళ్లాలని సూచించాడు. దీంతో లక్ష్మి తన బిడ్డలను తీసుకుని గడివేముల బయలుదేరింది. మార్గమధ్యలోని మంచాలకట్ట గ్రామ సమీపంలో ఎస్సార్‌బీసీ ప్రధాన కాలువ వద్ద ఇద్దరు చిన్నారులతో దిగడంతో అటుగా వెళ్తున్న స్థానిక రైతులు ‘ఏమ్మా..ఇక్కడ కూర్చున్నావ్‌’ అని అడిగారు. 

ఆ వెంటనే లక్ష్మీ ఇద్దరు కుమార్తెలను కాలువలో పడేసి తానూ దూకింది. రక్షించేందుకు స్థానికులు యత్నించగా.. ‘నేను చావడానికే వచ్చాను.. మమ్మల్ని ఎవరూ కాపాడవద్దు’ అని కేకలు వేసింది. స్థానిక ఎస్‌ఐ నాగార్జునరెడ్డి కేసు నమోదు చేసి, సిబ్బందితో కలిసి ఎస్సార్‌బీసీ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు.  

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)