చిన్నారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Published on Sun, 01/18/2026 - 06:16

నంద్యాల: ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. తల్లి ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యా­లలో కలకలం రేపింది. నంద్యాల టూటౌన్‌ సీఐ అస్రార్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని లలితానగర్‌కు చెందిన ఉదయ్‌కిరణ్, ఎస్‌బీఐ కాలనీకి చెందిన మల్లికకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఉదయ్‌కిరణ్‌ పట్టణంలోని ఫెర్టిలైజర్‌ షాపు నిర్వహిస్తుండగా మల్లిక (27) గృహిణి. కొంతకాలంగా భార్యా­భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం మల్లికను భర్త తీవ్రంగా కొట్టడంతో ఆమె కుడిచేతిపై గాయాలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన మల్లిక జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడేందుకు నిర్ణయించుకుంది.

ఇంట్లో ఉన్న పురుగు మందును ఇద్దరు పిల్లలకు తాగించి.. తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన మృతురాలి బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి మల్లికను, పిల్లలు ఇషాంత్‌ (3), పరిణతి(9 నెలలు)ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహంపై గాయాలను గుర్తి­ంచడంతో పాటు ఇంట్లో ఉన్న రెండు పురుగు మందు డబ్బాలను సీజ్‌ చేశారు. భర్త ఉదయ్‌కిరణ్‌ పరారీలో ఉన్నాడు. మృతురాలి తమ్ముడు కార్తీక్‌ ఫిర్యాదు మేరకు భర్త ఉదయ్, ఆడపడుచు, తోటికోడళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)