Breaking News

అదిగో.. నాలుగో శతాబ్దపు మానవుల జాడలు

Published on Sat, 01/25/2025 - 05:01

బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా):  అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం రేంజిలోని లంకమల అభయారణ్యంలో గురువారం వెలుగుచూసిన శిలా శాసనాలు 4–15 శతాబ్దాల మధ్య కాలపు అతి పురాతన మానవ ఆనవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా రాయలసీమలో శంఖు లిపి ఆనవాళ్లు ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు. తొలిసారిగా ఈ అటవీ ప్రాంతంలో ఈ ఆనవాళ్లు లభించడం చాలా అరుదైన విషయమని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. 

అటవీ శాఖాధికారుల ద్వారా వెలుగులోకి వచ్చిన 15 శాసనాల్లో కొన్నింటిని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. మునిరత్నంరెడ్డి తర్జుమా చేశారు. ఐదు శాసనాలను శుక్రవారం అధ్యయనం చేయగా, తొలిసారి రాయలసీమలో లభ్యమైన శంఖు లిపి శాసనాల అధ్యయనం అంత సులువుగా సాధ్యంకాదని తేల్చారు. ఒకేచోట వేర్వేరు శతాబ్దాలకు చెందిన లిపి ఆధారాలు ఉండటం విశేషం. 

కొండూరు, రోళ్లబోడు, ముత్తుకూరు, మద్దూరు, సిద్ధవటం అభయారణ్య ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన శాసనాల్లో చిన్నచిన్న పదాలు మాత్రమే ఉన్నాయి. దీని ఆధారంగా పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులకు ఆ కాలంనాటి వ్యక్తులు, వాళ్ల ఉనికి చాటుకోవడం కోసం లంకమల అభయారణ్యంలో ఎవరు ఉండేవారో తెలిసేలా వారి పేర్లను ఇలా బండలపై చెక్కి ఉంటారని నిర్థారించారు. 

బ్రాహ్మీ లిపిలో ‘చంద్రహాస’.. 
అభయారణ్యంలో బండరాయిపై లభ్యమైన శాసనాల్లో బ్రాహ్మీ లిపి ఉంది. 4, 5, 6 శతాబ్దాల మధ్య ఈ లిపి మనుగడ సాగించింది. ఈ లిపిలో చంద్రహాస అని పేరు చెక్కి ఉంది. అంటే.. ఇతను ఈ అటవీ ప్రాంతంలో నివసించి.. ఈ ప్రాంతం తనదిగా భవిష్యత్తు తరాలకు తెలిసేలా బ్రాహ్మీ లిపిలో రాతిపై శాసనం చెక్కినట్లు నిర్ధారించారు.  

సంస్కృత భాష– నాగర లిపి  
మరో బండరాయిపై.. సంస్కృత భాష కలిసిన నాగర లిపిలో శాసనం చెక్కారు. ఇందులో రెండు పేర్లు ప్రస్తావించారు. ఎనిమిదో శతాబ్దిలో ‘శ్రీ విశిష్ట కంకణ దారి’ అని చెక్కి ఉంది. ఇది కూడా పేరుకు సంబంధించిన శాసనంగా తేల్చారు. ఇతను అప్పట్లో ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా తన గురించి తెలిపేలా ఈ శాసనం వేసుకున్నట్లు నిర్థారించారు. ఇందులోనే 15వ శతాబ్దికి చెందిన సంస్కృత భాషలో ‘స్థల కర చానప్ప’ పేరు కూడా చెక్కి ఉంది. 

సంస్కృతంలో బ్రాహ్మీ లిపి.. 
ఇక నాలుగు–ఐదు శతాబ్దాలకు చెందిన సంస్కృతంలో ఉన్న బ్రాహ్మిలిపిని కూడా కనుగొన్నారు. ఈ భాష, లిపి కలయికతో ఉన్న శాసనంలో ‘యే ధర్మజ’ అన్న పేరు ఉంది. ఇతను ఈ ప్రాంత నివాసిగా శాసనం వేయించుకున్నట్లు తేల్చారు.  

వారంతా శైవభక్తులు.. 
లంకమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చి­న శాసనాల ఆధారంగా అప్పటి మానవులు శైవభక్తులుగా గుర్తించారు. అప్పట్లో వీరు బుద్ధ–జైన మతాలను వ్యతిరేకించే వారని.. దీనిబట్టి నాటి శైవ ధర్మాన్ని వ్యాపింపజేశారని వీటి ఆధారంగా అధ్యయనం చేశారు. ఒక శాసనం పక్కన శివలింగ ఆకారం చెక్కి ఉండడంతో  దీన్నిబట్టి నాటే మత పరిస్థితులను అంచనా వేశారు. 

లిపి పరిణామ క్రమం.. 
లంకమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చిన శాసనాలు ఓ కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. అదేంటంటే.. లిపి పరిణామ క్రమం. 4, 5, 6 శతాబ్దాలకు చెందిన బ్రాహ్మిలిపి, 4, 5, 6, 7, 8 శతాబ్దాలకు చెందిన సంస్కృత భాష, 6, 7, 8 శతాబ్దాలకు చెందిన నాగర లిపి, 14వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపి.. ఈ మొత్తం లిపి, భాషతో కూడిన శా­సనాలు లభించాయి. ఇది అరుదైన విషయం. దీంతో లంకమల అభయారణ్యం లిపి పరిణామ క్రమానికి సాక్ష్యంగా నిలిచింది.

శంఖు లిపి అతి కష్టం
ఏపీలో ఆంధ్ర ప్రాంతంలో శంఖు లిపి వెలు­గుచూసింది. రాయలసీమలో మొద­టి­సారిగా లంకమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చింది. ఆరో శతాబ్దానికి చెందిన శంఖు లిపి ఎక్కువ కాలం మ­ను­గడ సాగించలేదు. దీంతో ఆ కాలంలో మానవ మనుగడపై సరైన ఆధారాల్లేవు. ఇప్పుడు లంకమలలో వెలుగు చూడటంవల్ల దీనిపై లోతై­న అధ్యయనం చేయాల్సి­న అవసరం ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో.. లంకమల అభయారణ్యం మానవ మనుగడపై పరిశోధన కేంద్రంగా మారబోతోంది. వెలుగు చూసిన శాసనాల్లో 4 నుంచి 15వ శతాబ్ది మధ్య మానవ పరిణామక్రమం.. లిపి పరిణామ క్రమంపై లోతైన అధ్యయనానికి భారతీయ పురావస్తు శాఖ సిద్ధమవుతోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)