Breaking News

అనకాపల్లి: ఫార్మా కంపెనీలో విష వాయువు లీక్‌.. కార్మికులు మృతి

Published on Thu, 06/12/2025 - 07:51

సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్‌ అయ్యాయి. ఈ విష వాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని ఎస్ ఎస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి విషవాయువులు లీక్ అయ్యాయి. విష వాయువు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను చంద్రశేఖర్, కుమార్‌గా గుర్తించారు. విష వాయువు కారణంగా పలువురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో, కంపెనీ యాజమాన్యం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయితే, ఫార్మా కంపెనీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు.. పరవాడ ఫార్మా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కేజీహెచ్‌లో పరామర్శించారు వైఎస్సార్‌సీపీ నాయకులు బొడ్డేడ ప్రసాద్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పరవాడ ఫార్మా కంపెనీల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మా కంపెనీలపై అధికారుల నియంత్రణ కొరవడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. కార్మికులంటే ప్రభుత్వానికి లెక్కలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)