Breaking News

ఫార్మాసిటీలో విష వాయువు లీక్‌

Published on Tue, 12/24/2024 - 04:43

పరవాడ: జేఎన్‌ ఫార్మాసిటీలోని రక్షిత్‌ డ్రగ్స్‌ ఫార్మా పరిశ్రమలో సోమవారం ఉదయం జరిగిన విష వాయువుల లీకేజీ ప్రమాదంలో ఇద్దరు కాంట్రాక్టు కార్మీకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు కోలుకోగా.. మ­రొ­కరి పరిస్థితి విషమంగా ఉందని పరవాడ సీఐ మల్లికార్జునరావు చెప్పారు.  పరిశ్రమలో ప్రొడక్షన్‌ బ్లాక్‌–1లో తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో రియాక్టర్‌లో పైకా బెండా జోన్‌ డ్రగ్‌ తయారు చేస్తున్నారు. ఈ క్ర­మంలో పైపులైన్‌ నుంచి హైడ్రోజన్‌ సల్ఫేడ్‌ అనే విష వాయువు లీకైంది. 

తెల్లవారు జామున విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే క్రమంలో ఒడిశాకు చెందిన దేవ్‌ బాగ్,  ఉగ్రేష్‌ గౌడ్‌లు విష వాయువును పీల్చడంతో అస్వస్థతకు లోన­­య్యారు. ఇతర కార్మికులు యాజమాన్యా­నికి సమాచారం అందించి, వెంటనే అంబులెన్స్‌­లో గాజువాకలోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు కొలుకోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వా­లని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదే­శించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పరవాడ తహసీల్దార్‌  అంబేడ్కర్‌ ఘటన స్థలానికి చేరుకుని వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)