Breaking News

దేశంలో ఐఐటీ బాంబే టాప్‌

Published on Thu, 06/06/2024 - 04:08

సాక్షి, అమరావతి: భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ప్రతిష్టాత్మక క్యూఎస్‌ వరల్డ్‌ వర్సిటీ ర్యాంకింగ్స్‌–2025లో భారతీయ వర్సిటీలు మెరుగైన ర్యాంకింగ్స్‌ దక్కించుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 61 శాతం భారతీయ వర్సిటీలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకోగా.. 24 శాతం వర్సిటీలు పాత ర్యాంకులనే పొందాయి. 

కేవలం 9 శాతం వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే మూడు కొత్త విశ్వవిద్యాయాలకు క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ జాబితాలో చోటు దక్కింది. జాతీయ స్థాయిలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) బాంబే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ)–బెంగళూరు, ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిలిచాయి.  

మెరుగైన ర్యాంకింగ్స్‌..   
ప్రపంచ ర్యాంకింగ్స్‌ జాబితాలో ఐఐటీ బాంబే గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 118వ ర్యాంక్‌ దక్కించుకుంది. ఐఐటీ ఢిల్లీ 197వ స్థానం నుంచి 150కి చేరుకుంది. ఐఐఎస్సీ 225 నుంచి 211వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ 271 నుంచి 222కు, ఐఐటీ మద్రాస్‌ 278 నుంచి 263వ ర్యాంకులకు చేరుకున్నాయి. ఐఐటీ కాన్పూర్‌ ర్యాంకు గతేడాది కంటే స్వల్పంగా తగ్గి 227వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి కనబర్చింది. 

ఈ వర్సిటీ 407వ ర్యాంక్‌ నుంచి 328వ ర్యాంకుకు చేరుకొని దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఐఐటీ రూరీ్కకి 335, ఐఐటీ గౌహతికి 477, అన్నా వర్సిటీలకు 383వ ర్యాంక్‌ వచి్చంది. ఐఐటీ ఇండోర్‌ 454 నుంచి 477వ ర్యాంక్‌కు పడిపోయింది. జాతీయ స్థాయిలో మొదటి 15 స్థానాల్లో ఐఐటీ వారణాసి (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 531వ స్థానం), జవహర్‌లాల్‌ నెహ్రూ వర్సిటీ(580), శూలినీ వర్సిటీ ఆఫ్‌ బయో టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ (587) వర్సిటీలున్నాయి. 

ఈ ఏడాది కొత్తగా సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌(డీమ్డ్‌) వర్సిటీ 641–650 ర్యాంకు పరిధిలో.. అలాగే దేశంలో 16వ స్థానం దక్కించుకుంది. టాప్‌–20లో ఐఐటీ హైదరాబాద్‌ (681–690), చండీగఢ్‌ వర్సిటీ (691–700), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తిరుచిరాపల్లి (701–710), యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై (711–720) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ–వెల్లూరు (791–800), ఎస్‌ఆర్‌ఎం చెన్నై (1,000–1,200) చోటు దక్కించుకున్నాయి. 

13 ఏళ్లుగా వరల్డ్‌ నంబర్‌ వన్‌గా ఎంఐటీ 
ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుసగా 13వసారి ఎంఐటీ అత్యుత్తమ ఇన్‌స్టిట్యూట్‌గా టైటిల్‌ను నిలుపుకుంది. మొత్తం 1,500 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను కేటాయించగా.. అమెరికా నుంచి అత్యధికంగా 197, బ్రిటన్‌ నుంచి 90, మెయిన్‌ ల్యాండ్‌ చైనా నుంచి 71 వర్సిటీలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ –10 కళాశాలలు/విశ్వవిద్యాలయాలు
మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) 
ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ 
ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం 
హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 
కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం 
స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం 
ఈటీహెచ్‌ జూరిచ్‌ 
నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జూరిచ్‌ 
యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ 
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)