Breaking News

టమాటా ధర ఢమాల్‌!

Published on Fri, 03/14/2025 - 05:42

పలమనేరు: చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. పలమనేరులోని టమాటా మార్కెట్‌లో గురువారం 15కిలోల బాక్సు ధర కేవలం రూ.50 పలికింది. దీంతో ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడులు పెట్టి టమాటా సాగుచేసిన రైతులు తమకు భారీ నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పలమనేరు హార్టికల్చర్‌ డివిజన్‌లో 4వేల హెక్టార్లలో టమాటా సాగు చేశారు. వెయ్యి హెక్టార్లలో పంట కోత దశకు వచ్చింది. 

ప్రస్తుతం స్థానిక రైతులు రోజూ పలమనేరు మార్కెట్‌కు 40టన్నుల వరకు టమాటాలు తీసుకొస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి రోజూ మరో 40టన్నుల వరకు టమాటా వస్తోంది. అయితే, కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడంతో ధరలు తగ్గిపోయాయి.

బయటి రాష్ట్రాల్లో టమాటా సీజన్‌ మొదలు
మన రాష్ట్రంలో టమాటా అత్యధికంగా పండించే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏటా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రా­ల్లో టమాటా సీజన్‌ మొదలైంది. అక్కడి అవసరాలకు స్థానిక సరుకు సరిపోతోంది. ఆయా రాష్ట్రాల నుంచి వ్యాపారులు చిత్తూరు జిల్లాకు రావడం లేదు. 

మరో­వైపు వేసవి మొదలుకావడంతో తోట­ల్లో టమాటా మాగడం మొదలైంది. వెంటనే అమ్ముకోవాలని రైతులు మాగినవాటిని కోసి మార్కె­ట్‌కు తీసుకొస్తు­న్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడం, డిమాండ్‌ కంటే సరఫరా ఎక్కువగా ఉండటంతో ధర తగ్గిపోయిందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఒక్కరోజుతో చేతులెత్తేసిన ప్రభుత్వం
రాష్ట్రంలోని టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. రైతులకు నష్టం రాకుండా మార్కెటింగ్‌ శాఖ ద్వారా టమాటాను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కానీ, మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇటీవల ఒక్కరోజు మాత్రం తూతూ మంత్రంగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్లకు పంపించారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో రైతులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. 

ఈ ధరలతో అప్పులపాలే..
ఎకరా పొలంలో టమాటా సాగుకు రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టాలి. బాగా పండితే ఎకరాకు 800 బాక్సులు దిగుబడి రావొచ్చు. ఇప్పుడున్న ధర రూ.50 ప్రకారం అయితే రైతుకు దక్కేది రూ.40వేలు మాత్రమే. రైతులు అప్పులపాలవడం ఖాయం. ప్రభుత్వమే టమాటాను మద్దతు ధరకు కొని రైతులను ఆదుకోవాలి. – గోవిందు, బేరుపల్లి, పలమనేరు మండలం 

ప్రభుత్వం పట్టించుకోలేదు..
రూ.లక్షలు ఖర్చుపెట్టి టమాటా సాగుచేసిన రైతులకు 15కిలోల బాక్సు ధర రూ.400 ఉంటే లాభమే. ఇప్పుడు బాక్సు ధర రూ.50 ఉంది. ఈ లెక్కన చూస్తే పూర్తిగా నష్టం తప్పదు. ఇటీవల మార్కెటింగ్‌శాఖ అధికారులు ఒక రోజు టమాటాను కొని రైతుబజార్లకు పంపారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. నిత్యం అధికారులు సరుకు కొంటే బయటి వ్యాపారులు సైతం ఎక్కువ ధరకు కొనే అవకాశం ఉంటుంది. రైతులకు లాభం వస్తుంది.– టీఎస్‌ బుజ్జి, టమాటా వ్యాపారి, పలమనేరు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)