Breaking News

టమాటా ధర భారీగా పతనం

Published on Fri, 03/28/2025 - 05:24

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులకు ఏటా వేసవిలో టమాటానే ప్రధాన పంట. ఈ దఫా  సీజన్‌ మొదలైనప్పటినుంచి టమాటా ధర భారీగా పతనమయ్యింది. పలమనేరు టమాటా మార్కెట్‌లో గురువారం 15 కిలోల బాక్సు  గరిష్ట ధర రూ.90, కనిష్ట ధర రూ.30 మాత్రమే పలికింది. దీనితో కనీసం టమాటాలను కోసే కూలీల ఖర్చు సైతం రైతులకు దక్కని పరిస్థితి నెలకొంది. – పలమనేరు 

పలమనేరు హార్టికల్చర్‌ డివిజన్‌లో సాగు వివరాలు 
వేసవిలో టమాటా సాధారణ సాగు: 5 వేల హెక్టార్లు 
ప్రస్తుతం సాగైన పంట: 7వేల హెక్టార్లు 
ఇప్పుడు కోత దశలో ఉన్న తోటలు:  600 హెక్టార్లు

బయటి రాష్ట్రాల్లో సీజన్‌... 
ప్రస్తుతం  చత్తీస్‌ఘడ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణాల్లో సీజన్‌ ఆఖరు దశలో ఉంది. అక్కడి అవసరాలకు లోకల్‌ సరుకు సరిపోతోంది. దీంతో అక్కడి వ్యాపారులు ఇక్కడికి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో లోకల్‌ వ్యాపారులు మాత్రమే ఇక్కడి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. దీనితో టమాటా ధర అమాంతం పడిపోయింది.  

అనంతపురం జిల్లాలో రోజుకు 700 మెట్రిక్‌ టన్నులు... 
ఇక అనంతపురం జిల్లానుంచి ఎక్కువగా టమాటాలు స్థానిక మార్కెట్లకు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆ జిల్లాలో 700 మెట్రిక్‌ టన్నుల టమాటా ప్రతిరోజూ మార్కెట్లకు వస్తోంది. నిత్యం అక్కడినుంచి 300 టన్నుల దాకా సరుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని పలు మార్కెట్లకు చేరుతోంది. ఫలితంగా డిమాండ్‌ కంటే ఎక్కువగా సరఫరా ఉంటోంది.  

ప్రభుత్వం ఆదుకోవాలి 
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరా పొలంలో టమాటా పేపర్‌ చేసి నాటాలంటే రూ.2 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి.ఈ ధరతో పంట పెట్టుబడి కూడా ద­క్కదు.   ప్రభుత్వం మమ్మల్ని ఆ­దు­కోవాలి.  – రామన్న, కురపల్లి, పలమనేరు మండలం

వచ్చేనెల నుంచి ఎగుమతులకు అవకాశం 
నే­షనల్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వా­రా ఏప్రిల్‌ 2 నుంచి ఎగుమతుల­కు  టెండర్లను పిలిచాం. ఆ త­ర్వా­­త ధరలు ఆశాజనకంగా ఉండొచ్చు. – సంజీవ కుమార్, ఏఎంసీ సెక్రటరీ, పలమనేరు 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)