Breaking News

నేడు రంజాన్‌ పండుగ

Published on Sat, 04/22/2023 - 04:23

సాక్షి, హైదరాబాద్‌:  దక్షిణాధి, ఉత్తరాది రాష్ట్రాల్లో నెలవంక కనబడటంతో ఈ నెల 22న (శనివారం) రంజాన్‌ పండుగ జరుపుకోవాలని రుహియతే హిలాల్‌ కమిటీ(నెలవంక నిర్ధారణ కమిటీ) ప్రతినిధి ముఫ్తీ సయ్యద్‌ ఖలీల్‌ అహ్మద్‌ తెలిపారు.

శుక్రవారం మొజంజాహీ మార్కెట్‌లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆకాశంలో మబ్బులు ఉండటంతో హైదరాబాద్‌లో నెలవంక కనబడలేదని, తెలంగాణలోని పలు జిల్లాల్లో అది కనబడినట్లు నిర్ధారణ అయిందని, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు రంజాన్‌ పండుగను జరుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. దీంతోపాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నెలవంక కనిపించినట్లు సమాచారం అందిందని చెప్పారు.

నెల రోజులపాటు కఠోర ఉపవాసాలు ఉండి దైవప్రసన్నత కోసం పాటించిన ఉపవాసాలు అల్లా స్వీకరించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా శాంతిపూర్వక వాతావారణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. రంజాన్‌ పండుగ(ఈదుల్‌ ఫితర్‌) నమాజ్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఈద్గాలతోపాటు దాదాపు అన్ని మసీదుల్లో ఉందన్నారు.

పలు ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం మైదానాల్లో కూడా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయా ఈద్గాలు, మసీదులు, మైదానాల్లో ఈదుల్‌ ఫితర్‌ నమాజ్‌ ఉదయం 6:30 గంట నుంచి 10:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి