Breaking News

నేడే ఎల్‌వీఎం3–ఎం5 ప్రయోగం

Published on Sun, 11/02/2025 - 05:37

సూళ్లూరుపేట/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌ ద్వారా 4,400 కిలోల బరువు కలిగిన సీఎంఎస్‌–03 అనే సమాచార ఉపగ్రహాన్ని ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి శనివారం సాయంత్రం 5.26 గంటలకు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ నారా­యణన్‌ కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. 

శనివారం ఉదయాన్నే షార్‌కు వచ్చిన ఆయన ప్రయోగవేదిక మీదున్న రాకెట్‌ను పరిశీలించిన అనంతరం సహచర శాస్త్రవేత్త­లతో ప్రయోగంపై ప్రత్యేకంగా సమీక్షించారు. 4,400 కిలోల బరువు కలిగిన సీఎంఎస్‌–03 కమ్యూనికేషన్‌ ఉపగ్రహం బహుళ–బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం కావడం విశేషం.

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్‌: తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ శనివారం దర్శించుకున్నారు. షార్‌ నుంచి ఆదివారం సీఎంఎస్‌–03 ఉపగ్రహాన్ని  ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎంఎస్‌–03 ఉపగ్రహం నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.  

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)