Breaking News

నేడు కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం

Published on Sun, 02/15/2026 - 03:44

నరసరావుపేట రూరల్‌: తిరునాళ్ల మహోత్సవానికి పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండ సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం నిర్వహించే ఈ తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు జాగరణకు తరలిరానున్నారు. త్రికోటేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరఫున విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు. భక్తులకు ఉచిత, ప్రత్యేక, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేక దర్శనం కల్పించే విధంగా క్యూలైన్లు సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. 

క్యూలైన్లలో భక్తులకు అందజేసేందుకు ఆరు లక్షల వాటర్‌ బాటిళ్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నా­రు. తిరునాళ్ల జాగరణకు ఈ ఏడాది 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి సౌకర్యార్థం ఆర్టీసీ కోటప్పకొండకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. 

నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి 618 బస్సులను నడపనుంది. కొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు తిరుమలకు చెందిన 120 బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా పరిశీలించారు. ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో మూడు వేల మంది సిబ్బందితో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.  

కొలువుదీరనున్న భారీ విద్యుత్‌ ప్రభలు 
ప్రభల పండుగగా పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లలో ఈ ఏడాది 26 భారీ విద్యుత్‌ ప్రభలు కొలువుదీరనున్నాయి. వీటితో పాటు 50 చిన్న ప్రభలు, వందకు పైగా మొక్కుబడి ప్రభలు కొండకు తరలిరానున్నాయి. భక్తులకు విక్రయించేందుకు రెండు లక్షల లడ్డూలు, లక్ష అరిసె ప్రసాదాలను సిద్ధంగా ఉంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది భక్తులకు చిన్న లడ్డూలను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)