Breaking News

నేడు కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం

Published on Wed, 02/26/2025 - 05:09

సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్‌:  అంగరంగ వైభవంగా సాగే తిరునాళ్లకు పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ కోటప్పకొండ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. మహా శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించే ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది జాగరణకు తరలివస్తారు. త్రికోటేశ్వర స్వామివారికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వ్రస్తాలను సమర్పించనున్నారు. తిరునాళ్లలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. 

ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, షామియానాలు వేశారు. క్యూ లైన్‌లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. దాతల సహకారంతో లక్ష వాటర్‌ బాటిల్స్, మజ్జిగ, పాలు పంపిణీ చేయనున్నారు. భక్తులకు అందజేసేందుకు లక్షన్నర లడ్డూలు, 75 వేల అరిసె ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. పోలీసు శాఖ 3 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనుంది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ ప్రాంతాల నుంచి యాత్రికులను చేరవేసేందుకు ఆర్టీసీ 565 బస్సులను నడపనుంది. 

కొండ కిందనుంచి పైకి భక్తులను చేరవేసేందుకు 85 లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. వైద్య శాఖ ఆధ్వర్యంలో కొండ మీద, కింద 15 శిబిరాలను నిర్వహించనున్నారు. 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. గ్రామాల నుంచి కొండకు వచ్చే భారీ విద్యుత్తు ప్రభలు తిరునాళ్లలో ప్రత్యేక ఆకర్షణ. ఈ ఏడాది 18 ప్రభలు కొండలో కొలువుదీరనున్నాయి.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)