Breaking News

నేడు మూడో విడత రైతు భరోసా జమ 

Published on Wed, 02/28/2024 - 05:06

సాక్షి, అమరావతి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్‌ రైతు భరోసా కింద మూడో విడత పెట్టు­బడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో బుధవా­రం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్‌–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ రెండు పథకాలకు అర్హత పొందిన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేయనున్నారు.



ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధి
ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలకు రూ.1,078.36 కోట్లను బుధవారం జమ చేయ­నుంది.

దేశంలో మరెక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్న­లతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వో­ఎఫ్‌ఆర్‌ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ‘వైఎస్సార్‌ రైతు భరోసా‘ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా నిలిచింది. ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీకి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున రూ.67,500 జమ చేసింది. బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి రూ.34,288 కోట్లు జమ చేసినట్టవుతుంది.

క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ
రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమ­యానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట ప్రభుత్వం చెల్లిస్తోంది. రబీ 2021–22, ఖరీఫ్‌–2022­లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును బుధవారం జమ చేయనున్నారు.

2014–15 నుంచి 2018–19 వరకు పెండింగ్‌ పెట్టిన బకాయిలతో సహా బుధవారం అందిస్తున్న రూ.215.98 కోట్లతో కలిపి.. 57 నెలల్లో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 84.66 లక్షల మంది రైతులకు అందించిన వడ్డీ రాయితీ మొత్తం రూ.2,050.53 కోట్లు అవుతోంది. తాజాగా జమ చేస్తున్న సాయంతో కలిపి 57 నెలల్లో రైతులకు వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,84,567 కోట్ల సాయం అందించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)