Breaking News

భగ్గుమన్న పొగాకు రైతు

Published on Fri, 06/27/2025 - 05:45

మద్దిపాడు/కొండపి: కూటమి సర్కారు, అధికారుల తీరుపై పొగాకు రైతులు భగ్గుమన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ప్రకాశం జిల్లాలో మరోసారి రోడ్డెక్కారు. మద్దిపాడు, కొండపి వేలం కేంద్రాల్లో గురువారం ఆందోళనలకు దిగారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని ముండ్లమూరు క్లస్టర్‌ రైతులు తీసుకొచి్చన పొగాకుకు ధర పూర్తిగా తగ్గించడంతో కోపోద్రిక్తులయ్యారు. జాతీయ రహదారిపై పొగాకు తగలబెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం నోబిడ్‌ అయిందని, కంపెనీలన్నీ కుమ్మక్కయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

 కిలోకు రూ.220 ఇస్తామని చెప్పిన కంపెనీలు రూ.180కి తగ్గించాయని, చివరకు రూ.160కి కొనుగోలు చేస్తామని, అదీ కాకుండా రూ.125లోపే కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.  

కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలోనూ గురువారం జువి్వగుంట, అయ్యవారిపాలెం, తంగెళ్ల, జాల్లపాలెం, పీరాపురం గ్రామాలకు చెందిన రైతులు కంపెనీలు ధర పూర్తిగా తగ్గించేశాయని వేలాన్ని బహిష్కరించారు. కిలోకు కనిష్ట ధర రూ.160 కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలం కేంద్రం ఎదురుగా కొండపి–టంగుటూరు రహదారిపై బైఠాయించారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి వేలం నిర్వహణ అధికారి జి.సునీల్‌ కుమార్, రైతులతో చర్చలు జరిపారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. 

పొగాకు పంట సాగు పరిమాణం నిర్ధారణ
కొరిటెపాడు: గుంటూరు జీటీ రోడ్డులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో గురువారం 165వ పొగాకు బోర్డు సమావేశం నిర్వహించారు. బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ చిడిపోతు అధ్యక్షత వహించారు. ఏపీ ప్రాంత పంట కాలానికి పంట సాగు పరిమాణం నిర్ధారించారు. అంతర్జాతీయ మార్కెట్‌ డిమాండ్, రైతు సాగుబడికి ఆమోదయోగ్యమైన పరిధికి అనుగుణంగా ఈ ప్రాంత పంట కాలానికి 142.00 మిలియన్‌ కిలోల పరిమాణాన్ని సమావేశంలో నిర్ధారించారు. సమావేశంలో ఈడీ విశ్వశ్రీ, డైరెక్టర్‌ (ఆక్షన్‌) శ్రీనివాస్, వైస్‌ చైర్మన్‌ బొడ్డపాటి బ్రహ్మయ్య పలువురు సభ్యులు హాజరయ్యారు. వర్చువల్‌ ద్వారా కర్ణాటక ఎంపీ పి.మహేశ్‌కుమార్, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌.. కర్ణాటక, గుజరాత్, బిహార్, యూపీ రాష్ట్రాల అధికారులూ పాల్గొన్నారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)