Breaking News

ఆది ఆగడం!

Published on Tue, 04/22/2025 - 05:07

సాక్షి ప్రతినిధి, కడప: అల్ట్రా టెక్‌ సిమెంట్‌ పరిశ్రమకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వేధింపులు తప్పడం లేదు. ఎమ్మెల్యే తన చర్యలను సమర్థించుకుంటూనే అనుచరగణాన్ని రెచ్చగొట్టి సిమెంట్‌ పరిశ్రమపై ఫిర్యాదు చేయించడమే కాకుండా అధికారులను ఉసిగొల్పి ముడిఖనిజం సరఫరా టిప్పర్లను సీజ్‌ చేయించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎర్రగుంట్ల సీఐ నరేశ్‌బాబు అల్ట్రా టెక్‌ పరిశ్రమకు ముడిఖనిజం సరఫరా చేసే ఐదు టిప్పర్లను అధిక లోడు పేరిట సోమవారం సీజ్‌ చేశారు.

దీంతో ట్రాన్స్‌పోర్టర్‌ సిమెంట్‌ పరిశ్రమకు ముడి ఖనిజం సరఫరా నిలిపేశారు. ఆపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు, మండల బీజేపీ ఇన్‌చార్జి మధుసూదనరెడ్డి సతీమణి పేరిట నిర్వహిస్తున్న ప్యాకింగ్‌ ప్లాంట్‌ పనులు నిలిపేశారు. యాజమాన్యంతో నిమిత్తం లేకుండా 40 మంది కార్మికులను పనుల నుంచి వెనక్కి పిలిపించారు. దీంతో సిమెంట్‌ సరఫరా చేసే ట్రాన్స్‌పోర్టు లారీలు ఆగిపోగా.. సిమెంట్‌ ఉత్పత్తి సైతం నిలిచిపోయింది.  

40 ఏళ్లలో తొలిసారి టిప్పర్లు సీజ్‌ 
40 ఏళ్లలో సిమెంట్‌ పరిశ్రమలకు ముడి ఖనిజం సరఫరా చేసే టిప్పర్లు అధిక లోడుతో వెళ్తున్నాయన్న ఆరోపణలు కూడా లేవు. గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన సీఐ సోమవారం హఠాత్తుగా ఐదు టిప్పర్లను సీజ్‌ చేశారు.  దీనివెనుక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఉన్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్యాకింగ్‌ ప్లాంట్‌ నిలిపేయడం పరిశ్రమ యాజమాన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టడమేనని పలువురు విమర్శిస్తున్నారు.

చేతులెత్తేసిన కలెక్టర్‌ 
అల్ట్రా టెక్‌ పరిశ్రమలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, కాలుష్య నియంత్రణ సక్రమంగా లేదని, చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదనే వంకతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరుల ద్వారా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌కు ఫిర్యాదు చేయించారు. వాస్తవంగా అల్ట్రా టెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో 89 శాతం మంది ఉద్యోగులు స్థానికులే ఉన్నారని సమాచారం. మరోవైపు నష్టాల్లో ఉండటంతో ఈ పరిశ్రమను ఐసీఎల్‌ యాజమాన్యం అల్ట్రా టెక్‌ సంస్థకు అప్పజెప్పింది. కాలుష్య నియంత్రణ సక్రమంగా పాటిస్తున్నామని పరిశ్రమ ప్రతినిధులు వివరిస్తున్నా కలెక్టర్‌ శ్రీధర్‌ నుంచి స్పందన లేదు. తానేమీ చేయలేనంటూ చేతులెత్తిసినట్లు సమాచారం.  

క్షమాపణ చెప్పకుంటే నీ దందాలు బయటపెడతా 
టీడీపీ అధ్యక్షుడు పల్లాకు తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ హెచ్చరిక    
ఎంవీపీకాలనీ(విశాఖపట్నం): తనను బహిరంగంగా దూషించడంతోపాటు అవమానానికి గురిచేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆయన దందాలను, సెటిల్‌మెంట్లను బయట­పెతానని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ సమస్య విషయమై ఇటీవల పల్లా శ్రీనివాస్‌ను కలవడానికి వెళ్లగా వ్యక్తిగతంగా తనను అవమానపరిచినట్లు బీవీ రామ్‌ పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ కోసం విశేషకృషి చేసిన తననే అవమానిస్తే మిగతా నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై పలువురు టీడీపీ ముఖ్యనాయకులతోపాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనెల 29లోపు పల్లా శ్రీనివాస్‌ క్షమాపణలు చెప్పకపోతే అధికార మదంతో విర్రవీగుతున్న అతడి భూదందాలు, సెటిల్‌మెంట్లు ఇతర అక్రమాలను బయట పెడతానని స్పష్టం చేశారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)