Breaking News

బుట్టాయిగూడెంలో పెద్ద పులి సంచారం

Published on Thu, 01/22/2026 - 09:53

బుట్టాయిగూడెం: ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తోంది.  నిన్న(బుధవారం) రాత్రి రెండు ఆవులు, ఒక దూడపై దాడి చేసి చంపేసింది పెద్ద పులి.. తొలుత అంతర్వేదిగూడెంలో ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత నాగులగూడెం సమీపంలో మరో ఆవు దూడపై దాడి చేసింది పెద్ద పులి. దాంతో ఆ ఆవు దూడ మృత్యువాత పడింది.  

ఈ నేపథ్యంలో బుట్టాయిగూడెం మండలంలో ప్రజలు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. ఏ క్షణాన పులి దాడి చేస్తుందోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మరొకవైపు పులి జాడ కోసం ఫారెస్ట్‌ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్ లో  పులి పాదముద్రలు గుర్తించారు. పులి సంచారంతో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

గత కొన్ని నెలలుగా ఆంధ్రా, తెలంగాణలో పెద్దపులులు, చిరుతలు తరచూ జనావాసాల్లోకి రావడం వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పంట పొలాలు, పశువుల పాకలు, రహదారులపై వీటి సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. 

 గండ్రెడ్డిపల్లి నుంచి మంచిర్యాల వరకు, కామారెడ్డి నుంచి రాజన్న సిరిసిల్ల వరకు పెద్దపులులు, చిరుతలు గ్రామాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.పొలాల్లో  పనులు చేయడానికి రైతులు వెనకాడుతున్నారు. పశువులను అడవుల్లో మేపడానికి పశుపోషకులు జంకుతున్నారు. వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్, నల్లమల అటవీ ప్రాంతాల సమీప గ్రామాల్లో నీరు, ఆహారం కోసం వన్యప్రాణులు తరచూ వస్తున్నాయి.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)