Breaking News

మెట్లపల్లిలో మరోసారి పులి కలకలం

Published on Mon, 01/06/2025 - 05:09

గన్నవరం రూరల్‌: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. గతేడాది డిసెంబర్‌ 18న ఇదే గ్రామంలో తోటలో పులి ఉచ్చులో చిక్కుకుని మరణించింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని చూసినట్లు ఆర్టీసీ కండక్టర్‌ చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కలటూరుకు చెందిన బొకినాల రవికిరణ్‌ గన్నవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌. విధుల నిమిత్తం గన్నవరం డిపోకు తెల్లవారుజాము 3 గంటల సమయంలో బైక్‌పై వస్తుండగా సగ్గూరు–మెట్లపల్లి దారిలో పులి పిల్ల ఎదురైంది.

దానిని చూసిన రవి కిరణ్‌ భయాందోళనకు లోనై సమీపంలోని సగ్గూరు వెళ్లి గ్రామస్తులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మెట్లపల్లి, వీరపనేనిగూడెం గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్‌ గార్డు కుమారి గ్రామానికి వచ్చారు. పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రయత్నించారు. జొన్న చేను వెంట పులి అడుగులు ఉన్నట్లుగా రైతులు ఆమెకు చూపించారు. ఈ అటవీ ప్రాంతంలో పులులు ఉన్నాయని ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)