Breaking News

చాపకింద నీరులా మధుమేహ ముప్పు

Published on Tue, 12/17/2024 - 05:40

సాక్షి, అమరావతి: దేశంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 10 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 2045 నాటికి 12 కోట్లకు చేరతారని అంచనాలున్నాయి. ప్రతి ఇద్దరిలో ఒకరికి రక్తంలో అసాధారణ గ్లూకోజ్‌ స్థాయిలు ఉన్నట్టు ప్రముఖ డయాగ్నోస్టిక్‌ ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్‌ సంస్థ థైరోకేర్‌ అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది దేశవ్యాప్తంగా 19.66 లక్షల మంది హెచ్‌బీఏ1సీ ఫలితాలను థైరోకేర్‌ సంస్థ విశ్లేíÙంచింది. వ్యాధి వ్యాప్తిలో భయంకరమైన పోకడలను గుర్తించినట్టు స్పష్టం చేసింది.

కలవరపెడుతున్న అసాధారణ గ్లూకోజ్‌ స్థాయి 
19.66 లక్షల మంది ఫలితాలను విశ్లేషించగా అందులో 49.43 శాతం మంది రక్తంలో అసాధారణ గ్లూకోజ్‌ స్థాయిలను కలిగి ఉన్నట్టు గుర్తించారు. 22.25 శాతం మంది ప్రీడయాబెటిక్‌ దశలో ఉండగా, 27.18 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఆహారంలో బియ్యాన్ని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలు మధుమేహం, ప్రీడయాబెటిస్‌ ముప్పు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు స్పష్టం చేశారు. గోధుమ ఆధారిత ఆహారాలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో తక్కువ ప్రాబల్యం రేటును ఉన్నట్టు వివరించారు.  

యువకుల్లో అధికంగా ప్రీ డయాబెటిక్‌  
18–35 ఏళ్ల యువతలో ప్రీ డయాబెటిక్‌ ప్రాబల్యం అధికంగా ఉండగా, 36–65 సంవత్సరాల వారిలో వ్యాధి ప్రభావం వృద్ధి చెందుతోంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు నిర్వహించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలు పాటించినట్‌లైతే వ్యాధిని నివారించవ­చ్చని థైరోకేర్‌ సూచించింది. ముందస్తు జాగ్ర­త్తల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవడంతో పాటు, తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ, ఒత్తిడి నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.

‘హాని’కరమైన ఆహార అలవాట్లు 
ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్‌ ఉండటానికి హానికరమైన ఆహార అలవాట్లే ప్రధాన కారణమని ఐసీఎంఆర్‌ గతంలో స్పష్టం చేసింది. సమోసా, పకోడీ, చిప్స్, నూడిల్స్‌ ఇలా మార్కెట్‌లో లభించే అ్రల్టాప్రాసెస్డ్‌ ఫుడ్స్‌తో మధుమేహం ప్రమాదం పెరుగుతున్నట్టు వెల్లడించింది. ఈ పదార్థాల్లో అడ్వాన్స్‌డ్‌ గ్‌లైకేషన్‌ అధికంగా ఉంటుందని, దీంతో ఈ ఆహారం తిసుకునే వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగి తొందరగా మధుమేహం బారినపడతారని పేర్కొంది. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)