Breaking News

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం

Published on Sun, 09/22/2024 - 04:14

రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. రెవెన్యూ యంత్రాంగం 200 మంది పోలీసులతో నా కుటుంబ సభ్యుల భూమిపైకి వచ్చి దౌర్జన్యం చేసింది. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ అధికారులు అత్యంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తా. రాజకీయ కక్షలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారు.  – వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు  

కాకినాడ: రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, రాజకీయ కక్షలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో తన కుటుంబానికి చెందిన 11 ఎకరాల భూమి విషయంలో అధికారుల అత్యుత్సాహమే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

 ప్రైవేటు వ్యక్తుల భూతగాదాలు, రాజకీయ నాయకుల మధ్య జరిగే వివాదాల తరహాలో ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం వ్యవహరించి 200 మంది పోలీసులతో తన కుటుంబ సభ్యుల భూమిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని త్రిమూర్తులు ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ అత్యంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా అధికారులు వ్యవహరించారంటూ ఆయన ధ్వజమెత్తారు. నిజానికి.. 2005లో తిప్పసాని మహాలక్ష్మి, నూనె శ్రీదేవిల నుంచి ఆ భూములను కొనుగోలు చేశామన్నారు. భూమి కొన్న సమయంలో రెవెన్యూ రికార్డులతో పాటు రిజి్రస్టేషన్‌ శాఖ ద్వారా కూడా అన్నీ పరిశీలించి ఎలాంటి వివాదాలు, ల్యాండ్‌ సీలింగ్‌ సమస్యలు లేవని తేలాకే ఆ భూమిని కొనుగోలు చేశామన్నారు.  

చట్ట విరుద్ధంగా.. రాజకీయ కక్షతో.. 
ఇక సుమారు 19 ఏళ్లుగా తమ ఆ«దీనంలో ఉన్నాయని, రెవెన్యూ రికార్డులలో కూడా తమ పేర్లతో ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే, ఆ భూములకు పన్నులు చెల్లిస్తున్నామని, చెరువులకు అనుమతులు కూడా ఇచ్చారని చెప్పారు. ఈ వాస్తవాలన్నీ పక్కన పెట్టి రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో అధికారులు అప్పటికప్పుడు నోటీసు ఇచ్చి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని త్రిమూర్తులు ప్రశి్నంచారు. ఇలాంటి విధ్వంసకర చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారన్నారు. చట్ట విరుద్ధంగా రాజకీయ కక్షతో చేసిన ఈ వ్యవహారంపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని తోట త్రిమూర్తులు చెప్పారు. పార్టీ మారేందుకు ప్రయతి్నస్తున్నానంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)