Breaking News

నత్తనడకన ఈ–కేవైసీ

Published on Thu, 10/03/2024 - 05:10

సాక్షి, అమరావతి:  దాదాపు ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్నప్పటికీ నిర్ధేశించిన గడువులోగా ఈ–క్రాప్‌నకు ఈ–కేవైసీ పూర్తి చేయలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వ నిర్వాకానికి తోడు సాంకేతిక సమస్యలు వెంటాడడంతో ఈ దుస్థితి నెలకొంది.   

ఇంకా లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్‌లోనే..
ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ ఉద్యాన, పట్టు తదితర పంటలన్నీ కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 96.68 లక్షల ఎకరాల్లో మాత్రమే  సాగయ్యింది. ఆ మేరకు ఈ–క్రాప్‌ నమోదు చేయగా, వీఏఏలు, వీఆర్వోల అథంటికేషన్‌ పూర్తి కాగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం నమోదయ్యింది. 

ఇంకా లక్షల ఎకరాలకు సంబంధించి లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ నమోదు కావాల్సి ఉంది. మరో పక్క మండల, జిల్లా అధికారుల సూపర్‌ చెక్‌ కూడా పూర్తి కాలేదు. సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ–క్రాప్‌ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్‌సైట్‌ సకాలంలో ఓపెన్‌ కాక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్‌ సరిగా పనిచేయక పోవడం తదితర  సాంకేతిక సమస్యలతో ప్రారంభంలో ఈ–క్రాప్‌ నమోదు నత్తనడకన సాగింది. 

కాగా, వరదలు, వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినడంతో నష్టం అంచనాల తయారీలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది నిమగ్నమవడంతో ఈ–క్రాప్‌ నమోదుకు కొంత కాలం బ్రేకులు పడ్డాయి. తొలుత సెపె్టంబర్‌ 15 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించినప్పటికీ, ఒకేసారి ఈ–క్రాప్, పంట నష్ట పరిహారం అంచనాలు తయారు చేయాల్సి రావడంతో గడువును  సెపె్టంబర్‌ 25వ తేదీకి పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ 30వ తేదీ వరకు గడువిచ్చారు. 

7వ తేదీ వరకు ఆధార్‌ దిద్దుబాటుకు అవకాశం
ఈ–కేవైసీ పూర్తి కాకపోవడంతో చేసేది లేక  మరోసారి గడువును పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్‌ అప్‌డేటెడ్‌ ప్రక్రియ పెండింగ్‌ వల్ల చాలా మంది రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో రైతుల ఈ–కేవైసీతో పాటు ఆధార్‌ దిద్దుబాటుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువునిచ్చారు. 

సూపర్‌ చెక్‌ కూడా 7వతేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ–క్రాప్‌ ముసాయిదా జాబితా 8వ తేదీన రైతుసేవాకేంద్రాలు (ఆర్బీకే)ల్లో ప్రదర్శించనున్నారు. 8 నుంచి 13వ తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి అదే సమయంలో పరిష్కరించనున్నారు. 16వ తేదీన తుది జాబితాను ప్రదర్శించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. 

ఈ క్రాప్‌ నమోదు ప్రక్రియ పూర్తయినట్టుగా 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భౌతిక రసీదులతో పాటు ఎస్‌ఎంఎస్‌ రూపంలో రైతుల మొబైల్‌ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపించనున్నారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)