Breaking News

థర్డ్‌ ఏసీ.. బహు ఖుషీ

Published on Thu, 02/27/2025 - 05:10

సాక్షి, అమరావతి : రైళ్లలో థర్డ్‌ ఏసీకి ప్రయాణికుల నుంచి డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో థర్డ్‌ ఏసీ ప్రయాణికుల సంఖ్య, ఆదాయమూ కూడా రెండింతలకు పైగా పెరిగినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రధానంగా కోవిడ్‌ అనంతరం థర్డ్‌ ఏసీ ప్రయాణికుల సంఖ్య పెరగడం గమనార్హం. కోవిడ్‌ ప్రభావంతో 2020–21లో డిమాండ్‌ బాగా తగ్గినప్పటికీ, ఆ తర్వాత ఏటేటా భారీగా పెరిగింది.  2024–25లో థర్డ్‌ ఏసీ కోచ్‌ల టికెట్ల ద్వారా రూ.30,089 కోట్లు రాబడి వచ్చిందని రైల్వే శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది.  

నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..
2019–20లో భారతీయ రైళ్లలో 11 కోట్ల మంది ప్రయాణించారు. వీరిలో 1.4 శాతం మాత్రమే థర్డ్‌ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి మొగ్గు చూపారు. ఆ ఏడాది థర్డ్‌ ఏసీ టికెట్ల ద్వారా రైల్వే శాఖకు రూ.12,370 కోట్ల రాబడి వచి్చంది.

కోవిడ్‌ అనంతర పరిణామాలతో గత ఐదేళ్లలో థర్డ్‌ ఏసీ ప్రయాణికుల సంఖ్య అమాంతం పెరిగింది. 2024–25లో థర్డ్‌ ఏసీలో 26 కోట్ల మంది ప్రయాణించారు. మొత్తం రైల్వే ప్రయాణికుల్లో వీరు 19 శాతానికి పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2019–20తో పోలిస్తే 2024–25లో రైల్వే టికెట్ల రాబడిలో స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణికుల వాటా తగ్గింది. 2019–20లో స్లీపర్‌ క్లాస్‌ టికెట్ల వాటా 27శాతం ఉంది. మొత్తం రాబడి రూ.50,669 కోట్లు కాగా అందులో స్లీపర్‌ క్లాస్‌ టికెట్ల ద్వారా రూ.13,641కోట్లు వచ్చింది. మొత్తం ప్రయాణికులు 809 కోట్ల మంది కాగా, 37 కోట్ల మంది స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణించారు. 

అంటే 4.6 శాతం. 2024–25లో మొత్తం రైల్వే రాబడిలో స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ టికెట్ల వాటా 19.5 శాతానికి తగ్గింది. సంఖ్యాపరంగా స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరిగింది. మొత్తం 38 కోట్ల మంది అంటే మొత్తం ప్రయాణికుల్లో 5.25 శాతం మంది స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణించారు. 


 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)