Breaking News

రూ.12 కోట్ల విలువైన బంగారందోపిడీ కేసులో దొంగ అరెస్ట్‌

Published on Sun, 08/17/2025 - 05:59

హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట ఎస్‌బీఐ బ్రాంచ్‌లో గత నెల 27వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసులో అనిల్‌కుమార్‌ పన్వార్‌ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు హరియాణలో అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని హిందూçపురం డీఎస్పీ కేవీ మహేష్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ అనంతరం పన్వార్‌ను కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. పన్వార్‌పై 16 కేసులు ఉన్నట్లు సమాచారం. 

బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ గ్రిల్‌ను గ్యాస్‌ కట్టర్‌తో తొలగించి లోపలికి చొరబడిన దొంగలు ఐరన్‌ లాకర్‌ డోర్‌ను గ్యాస్‌కట్టర్‌తో కత్తిరించి.. అందులోని సుమారు రూ.12 కోట్ల విలువైన 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన ప్రత్యేక పోలీసు బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటించి, పాత నేరస్తులను విచారించి, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించాయి. చోరీకి గురైన సొ­త్తు ఆచూకీ ఇంకా తెలియరాలేదని, కోర్టు అ­నుమతితో పన్వార్‌ను కస్టడీకి తీసుకుని వి­చా­­రణ కొనసాగిస్తామని డీఎస్పీ తెలిపారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)