Breaking News

తురకపాలెంలో బ్యాక్టీరియాపై సమాచారం లేదు

Published on Sat, 09/06/2025 - 05:34

గుంటూరు రూరల్‌: ‘‘కలుషిత నీరు అంటూ తురకపాలెంలో మరణాలకు రకరకాల కారణాలు చెబుతున్నారు. అసలు ఎలాంటి బ్యాక్టీరియా అనేది అంతుచిక్కలేదు. మెలియోడోసిస్‌పై సమాచారం లేదు. ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు వార్తలొచి్చనా రక్త నమూనాల పరీక్షల ఫలితాల్లో అలాంటిది కనిపించలేదు’’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ తెలిపారు. బాధితులకు గుంటూరు జీజీహెచ్‌లో పూర్తి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తురకపాలెంలో శుక్రవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండ్యన్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి ఆయన పర్యటించారు. 

జూలై నుంచి 23 మంది చనిపోయారని, అయినా క్షేత్రస్థాయి వైద్య  సిబ్బంది ఉన్నతాధికారులను అప్రమత్తం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మరణాలకు కారణాలపై లోతుగా విశ్లేషణ చేస్తున్నామని, 14 వైద్య బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అందరి రక్త, నీరు, మట్టి నమూనాలూ తీసుకున్నారని చెప్పారు.  తురకపాలెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లి పరీక్షల నిర్వహణ వివరాలను మంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

మరణాల సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకురావడంలో జరిగిన వైఫల్యాలు గుర్తించేందుకు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలన్న దానిపై  సిఫారసులు చేసేందుకు ఐఏఎస్‌ అధికారి, డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ డాక్టర్‌ అట్టాడ సిరి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో విఫలమైన వైద్య ఆరోగ్య సిబ్బందిపై శాఖాపరంగా చర్యలుంటాయన్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)