Breaking News

నోటి మాటతో గోడ కట్టారు

Published on Sat, 05/03/2025 - 03:58

సాక్షి, విశాఖపట్నం: ఏకంగా ఐదుగురు మంత్రులు స్వయంగా పర్యవేక్షించినా సింహగిరిపై ఏడుగురు భక్తుల ప్రాణాలు బలై పోయిన నేపథ్యంలో తన దారుణ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి సర్కారు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు గోడ నిర్మాణంలో వైదిక నియమాల ఉల్లంఘన జరిగిందా? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా చేపట్టారా? అనే అంశాలను తాజాగా తెరపైకి తెచ్చింది. ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దేవదాయ – పర్యాటక శాఖల మధ్య సమన్వయం లోపించిందంటూ పక్కదారి పట్టించే ఎత్తుగడలకు తెర తీసింది. 

మంత్రుల పర్యవేక్షణలోనూ ఇంత దారుణం జరగడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తున్నా మభ్యపుచ్చే యత్నాలు చేయడంపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది.  సింహాచలంలో భక్తుల మృత్యువాతపై రెండు రోజుల పాటు విచారణ జరిపిన త్రిసభ్య కమిషన్‌ శనివారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. తొలిరోజు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఈవో, ఏఈవో,  దేవస్థానం అధికారులను విచారించగా రెండోరోజు సర్క్యూట్‌ హౌస్‌లో విచారణ జరిపారు. నోటిమాటతో గోడ కట్టారని.. ఎలాంటి డిజైన్, అనుమతులు లేవని ప్రాథమికంగా తేలినట్లు కమిషన్‌ సభ్యులు చెప్పారు. 

సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై సురేష్ కుమార్‌ చైర్మన్‌గా, సభ్యులు ఆకె రవికృష్ణ, వెంకటేశ్వరరావులతో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన మ్యాప్‌లు, డ్రాఫ్ట్‌ కాపీలను కమిషన్‌ సేకరించింది. గోడ నిర్మాణం చేపట్టొద్దని ముందుగానే అధికారుల్ని హెచ్చరించామని దేవస్థానం అర్చకులు, వైదిక పండితులు పేర్కొన్నట్లు సమాచారం. కలెక్టర్‌ హరేంధిరప్రసాద్, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ విచారణకు హాజరై తాము సేకరించిన వివరాలను కమిషన్‌కు అందించారు. 

ఇంజనీర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సీపీ తన నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఏప్రిల్‌ 29, 30వ తేదీలకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలో సీసీటీవీ ఫుటేజీని స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం కమిషన్‌ చైర్మన్‌ సురేష్ కుమార్‌  మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ‘శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తాం. పూర్తిస్థాయి నివేదికకు నెల సమయం ఉన్నందున మరికొంత మందిని విచారిస్తాం. మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా కొన్ని పనులు జరిగినట్లు మా దృష్టికి వచ్చాయి. ఎవరి ఆమోదంతో మార్పులు చేశారో తెలియాల్సి ఉంది. గోడ నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు లేవు. 

ఎవరు అనుమతి ఇచ్చారు? స్ట్రక్చరల్‌ డిజైన్లు, మెటీరియల్‌కు సంబంధించి ఒక్క రికార్డు కూడా లేదు. కేవలం నోటిమాట ద్వారానే గోడని నిర్మించినట్లు ప్రాథమికంగా నిర్థారించాం. ‘ప్రసాద్‌’ పథకం కింద మంజూరైన పనులు 2024 ఆగస్ట్‌ నాటికే పూర్తి కావాలి. ఆలస్యంపై దేవస్థానం, టూరిజం అధికారులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది..’ అని కమిషన్‌ చైర్మన్‌ పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)