Breaking News

తల్లికి వందనం నగదు తీసుకున్నాడని..

Published on Tue, 07/08/2025 - 09:53

అన్నమయ్య: తల్లికి వందనం నగదు కోసం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో, భర్త తాగే మద్యంలో భార్య విషం కలిపి చంపేసిన ఘటన అన్నమయ్య జిల్లా కొత్తవారిపల్లె పంచాయతీ రెడ్డిగానిపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వంకొల్ల చంద్రశేఖర్‌(46), రమాదేవి దంపతులు. ఇటీవల తల్లికి వందనం నగదు రమాదేవి ఖాతాలో జమయింది. ఈ నగదును చంద్రశేఖర్‌ తీసుకోవడంతో ఇద్దరూ  గొడవ పడ్డారు. 

ఈ నెల 2న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్, భార్యను తాను తెచ్చుకున్న మద్యాన్ని గ్లాసులో పోసి ఇవ్వాల్సిందిగా కోరాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమాదేవి, మద్యం గ్లాసులో విషం కలిపి ఇచ్చింది. అనంతరం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన రమాదేవి భర్త గొంతుపట్టుకుని నొక్కడంతో ఆమె చేతిగోళ్లు గుచ్చుకుని, చంద్రశేఖర్‌ గొంతుకు గాయమైంది. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్‌ తమ్ముడు మహేష్‌.. వదినపై అనుమానంతో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో రమాదేవి తన భర్తను హత్య చేసినట్లు తేలింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)