Breaking News

గుడిలో దుర్గమ్మను ఫొటో తీసేందుకు భక్తుడి యత్నం

Published on Wed, 08/14/2024 - 11:12

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఓ భక్తుడు నిబంధనలను అతిక్రమించి సెల్‌ఫోన్‌తో దుర్గగుడిలోకి ప్రవేశించాడు. అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు. దీనిని గుర్తించిన ఆలయ అధికారులు ఆ భక్తుడి నుంచి సెల్‌ఫోన్‌ లాక్కుని హుండీలో వేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వారం క్రితం కూడా  ఓ భక్తుడు అమ్మవారి మూలవిరాట్‌ను సెల్‌ ఫోన్‌తో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన సంగతి విదితమే. 

ఆదివారం నుంచి భక్తులు ఎవరూ సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించకుండా ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని మైక్‌ ప్రచార కేంద్రం నుంచి పదే పదే సెల్‌ఫోన్లతో ఆలయంలోకి ప్రవేశించవద్దని సూచనలు చేస్తూనే ఉన్నారు. అయితే సోమవారం రాత్రి ఓ భక్తుడు తన ఖరీదైన సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు. 

ఇంతలో అక్కడే ఉన్న సెక్యూరిటీ, ఆలయ సిబ్బంది వెంటనే గమనించి కేకలు వేయడంతో ఆ భక్తుడు సెల్‌ఫోన్‌ తీసుకుని రావిచెట్టు వైపు పరుగు తీశాడు. ఆ భక్తుడికి పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఆలయ ఈఓ రామరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈఓ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆ భక్తుడి నుంచి సెల్‌ఫోన్‌ తీసుకుని ఆలయంలో ఉన్న హుండీలో వేశారు. హుండీ కానుకల లెక్కింపు సమయంలో సెల్‌ఫోన్‌ను బయటకు తీస్తారని, అప్పుడు దానిని ఏమి చేయాలో ఆలోచిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.    

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)