Breaking News

మార్చి నుంచే సూరీడు... సుర్రు

Published on Sun, 03/02/2025 - 04:25

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి  నుంచే ఎండలు మండుతున్నాయి. ఇంకా చెప్పాలంటే... వేసవి కాలం ఫిబ్రవరి నెలలోనే వచ్చేసిందా అనేలా కొన్ని చోట్ల పరిస్థితులు కనిపించాయి.  ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో 38.6 సెంటీగ్రేడ్‌ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఈ వేసవిలో సూర్యుడు మార్చి నెల నుంచే సుర్రుమనిపిస్తున్నాడని, ఏప్రిల్, మే నెలల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు. ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఆయన మీడియాకు ఓప్రకటన విడుదల చేశారు.  

» మార్చి నుంచి మే  వరకు చిత్తూరు, తిరుపతి,  శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎ­స్సా­ర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మిన­హా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కు­వ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వడగాలులు వీయవచ్చు.
» మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ  ప్రభావంఎక్కువగా ఉంటుంది.
» విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతపై  ముందస్తుగా హెచ్చరికలు  చేస్తుంది.  
» జిల్లా యంత్రాంగాలకు రెండు రోజుల ముందుగానే  వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనుంది.
» ఎండల సమాచారం కోసం  24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలి.
» ఎండలతో పాటు క్యుములోనింబస్‌ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెట్ల కింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)