Breaking News

కొనసాగుతున్న వడగాడ్పులు

Published on Fri, 04/26/2024 - 06:26

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాడ్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా పలుచోట్ల 43–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 174 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 170 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

రాజాం (విజయనగరం)లో 45.5, కొండయ్యగూడెం (అల్లూరి జిల్లా)లో 45.1, కాజీపేట (వైఎస్సార్‌)లో 44.7, కోడుమూరు (కర్నూలు)లో 44.2, దేవరాపల్లి (అనకాపల్లి)లో 44.1, నందరాడ (తూర్పు గోదావరి), రావిపాడు (పల్నాడు), కొల్లివలస (శ్రీకాకుళం)లలో 44 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణో­గ్రతలు నమోదయ్యాయి. రానున్న మూ­డు రో­జులు రాష్ట్రంలో పలుచోట్ల 43–44 డి­గ్రీలు, కొన్నిచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశాలున్నాయి.    కో­స్తాం­­ధ్రపై ఉన్న ఉప­రి­తల ఆవర్తనం గురువారం బలహీన పడింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా తమిళనాడు ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రలో ఒకట్రెండుచోట్ల  వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)