Breaking News

బాప్‌రే.. భగభగలు

Published on Sun, 04/07/2024 - 02:58

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఏడు జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీలకు చేరువలోకొచ్చి మంట పుట్టించాయి. రాష్ట్రంలోని 670 మండలాలకు గాను 358 మండలాల్లో (సగానికి పైగా) వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు దడ పుట్టించాయి. 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 231 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపాయి.

శనివారం అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, ప్రకాశం జిల్లా తోకపల్లె, వైఎస్సార్‌ జిల్లా బలపనూరుల్లో రికార్డు స్థాయిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.

ఆదివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 222 మండలాల్లో వడగాడ్పులు, సోమవారం 22 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం 24, పార్వతీపురం మన్యంలో 11, విశాఖపట్నం 1, అనకాపల్లి 7, కాకినాడ 4, తూర్పుగోదావరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  

రేపట్నుంచి కాస్త చల్లదనం..  
కొద్దిరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒకింత చల్లని వార్తను మోసుకొచి్చంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడేందుకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తాయని తెలిపింది. ఉష్ణతాపం తగ్గినా పలు ప్రాంతాల్లో ఉక్కపోత, అసౌకర్య వాతావరణం మాత్రం ఉంటుందని వివరించింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)