Breaking News

ఉదయగిరి ఎమ్మెల్యే కర్ర సా(స్కా)ము

Published on Wed, 01/29/2025 - 05:21

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కూటమి  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  తెలుగుదేశం ఎమ్మెల్యేలు సహజ వనరులను దోపిడీ ఘరూ చేశారు. ఇసుక, గ్రావెల్, క్వార్ట్‌జ్‌ మెటల్‌ను దోచేస్తున్న నేతలు తాజాగా అగ్రిగోల్డ్‌ భూములపై కన్నేశారు. 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వందలాది ఎకరాల్లోని జామాయిల్‌ కర్రను అక్రమంగా నరికించి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షాత్తు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌ కార్యాలయం నుంచే అక్రమ దందా పర్యవేక్షణ జరుగుతుండడంతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం కూడా వారికి సహకరిస్తోంది. 

450 ఎకరాల్లో అగ్రిగోల్డ్‌ జామాయిల్‌ తోటలు
ఉదయగిరి నియోజవర్గంలోని వరికుంటపాడు, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు మండలాల్లో సుమారు 450 ఎకరాలు అగ్రిగోల్డ్‌ భూములు ఉన్నాయి. ఈ భూములను ఆ సంస్ధ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. సంస్థ దివాలా తీయడంతో ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఈ భూముల్లో జామాయిల్, మామిడి, ఎర్ర చందనం, శ్రీగంధం తదితర మొక్కలు ఉన్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఈ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా, అందులో ఉన్న విలువైన సంపద చోరీ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. 

ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం రాకతో తెలుగుదేశం నాయకులు వరికంటపాడు పంచా­యతీ పరిధిలో ఉన్న భాస్కరపురం, జంగం రెడ్డిపల్లి, కనియంపాడు గ్రామాల్లో అగ్రిగోల్డ్‌ భూముల్లో ఉన్న దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే జామాయిల్‌ కర్రను నరికించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 

పక్కా ప్రణాళిక
భాస్కరపురం రెవెన్యూలో 69 నుంచి 112 వరకు పలు సర్వే నెంబర్లలో సుమారు 140 ఎకరాల అగ్రిగోల్డ్‌ భూములు బినామీ పేర్లపై ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా అగ్రిగోల్డ్‌ ఆస్తులుగా నమోదు కాలేదు. 

పైగా ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా అవి అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందినట్లుగా తెలిపే సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో స్థానికులకు, రెవెన్యూ అధికారులకు తప్ప మిగితా వారు ఆ భూములు గుర్తించలేరు. దీనిని ఆసరా చేసుకున్న ఒక అధికార ప్రజాప్రతినిధి రెవెన్యూ, పోలీసు అధికారులను మ్యానేజ్‌ చేశారు. 

ఎవరైనా ఈ విషయం గురించి రెవెన్యూ అధికారులను అడిగితే అవి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు అని చెప్పి తప్పించుకుంటున్నారు. విషయం తెలిసిన స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసుల పేరుతో భయపెడుతున్నారు.

తరలుతున్న సంపద
వరికుంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న అగ్రిగోల్ట్‌ భూముల్లో సుమారు 12,500 టన్నుల వరకు జామాయిల్‌ కర్ర ఉందని అంచనా. ప్రస్తుతం టన్ను జామాయిల్‌ రూ.8 వేలు వరకు విక్రయిస్తున్నారు. దీంతో సుమారు రూ.10 కోట్లు విలువ చేసే కర్రను గత వారం రోజుల నుంచి నరికి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల 
నుంచి నాలుగు ముఠాలను రప్పించి రోజువారీగా నరికిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ నేతలకు బెదిరింపులు
అగ్రిగోల్డ్‌ భూముల్లో జామాయిల్‌ కలప నరికివేత విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ నేత ఒకరు ప్రశ్నించగా పోలీస్‌ తరహాలో బెదిరింపులు వెళ్లాయి. ఈ విషయం వెలుగులోకి తెచ్చినా, అడ్డుకున్నా నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.  

తాజాగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచే పర్యవేక్షణ జరుగుతుండడంతో పాటు పది రోజులుగా ఒక ప్రణాళిక ప్రకారం అధికారులను, నాయకులను మ్యానేజ్‌ చేసుకుని పక్కాగా జామాయిల్‌ కర్రను నరికించేసి విలువైన సంపదను దోచుకుంటున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)