దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

Published on Mon, 07/03/2023 - 03:33

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌ భాగ్యనగర్‌ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం బంగారు బోనం సమర్పించింది. 11 రకాల బోనాలు, పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి బంగారు బోనంతో పాటు అందజేసింది. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తీన్‌మార్‌ డప్పులు, కోలాట నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఇంద్రకీలాద్రికి చేరిన ఊరేగింపునకు దుర్గగుడి చైర్మన్‌ రాంబాబు, ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు బంగారు బోనం అందజేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న శాకంబరీదేవి ఉత్సవాలు ఆదివారం రెండో రోజూ వైభవంగా కొనసాగాయి.

రికార్డు స్థాయిలో సుమా­రు 70 వేల పైచిలుకు భక్తులు అమ్మవారిని శాకంబరీదేవిగా దర్శించుకున్నారు. కాగా, దుర్గమ్మను శాకంబరీదేవి అలంకారంలో రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం దర్శించుకున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)