Breaking News

రైవాడ జలాశయాన్ని సందర్శించిన సాంకేతిక బృందం

Published on Sat, 09/16/2023 - 03:54

దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): ఢిల్లీ నుంచి వచ్చిన సాంకేతిక బృందం శుక్రవారం రైవాడ జలాశయాన్ని సందర్శించింది. గౌరవ్‌ భగత్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ప్రత్యేక బోటులో ప్రయాణించి సర్వే నిర్వహించింది. బోటులో అమర్చిన ల్యాప్‌టాప్‌తో పాటు కెమెరాల ఆధారంగా సర్వేను చేపట్టారు. డ్యామ్‌ రీహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (డ్రిప్‌)లో రైవాడ జలాశయం పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రూ.252 కోట్లతో గతంలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ)కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపారు.

1990లో వచ్చిన భారీ వరద దృష్ట్యా ఎటువంటి తుపాన్లు సంభవించినా ఎదుర్కొనేలా కొత్త స్పిల్‌వే గేట్లు అమర్చాలని డ్రిప్‌ పథకంలో ప్రతిపాదించారు. జలాశయం స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాల మేర­కు సాంకేతిక అధికారుల బృందం ఇక్కడికి వచి్చంది.

అధునాతన సాంకేతికత ఆధారంగా జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం, ఎంతమేర పూడిక ఉంది, జలాశయం విస్తీర్ణం, జలాశయం గర్భంలో ఎక్కడైనా నిర్మాణాలు జరిగాయా తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు.15 రోజులపాటు ఈ సర్వే జరుగుతుందని, అనంతరం సర్వే రిపోర్టును ఢిల్లీలోని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌కు అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. వీరికి జలాశయం డీఈ సత్యంనాయుడు, జేఈలు నంద కిశోర్, రవిప్రకాష్‌ తదితరులు జలాశయ  స్థితిగతులను వివరించారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)