Breaking News

టీఐఎస్‌లో సాంకేతిక సమస్యలు

Published on Fri, 12/27/2024 - 04:38

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల కోసం ఆన్‌లైన్‌లో వివరాల నమోదుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 1.87 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ సర్వీసు వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాల వారీగా ఈ నెలాఖరులోగా వివరాలను అప్‌లోడ్‌ చేయాలని చెప్పడంతో ఉపాధ్యాయులు అదే పనిలో ఉన్నారు. 

అయితే, సాంకేతిక సమస్యలతో పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని టీచర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం (టీఐఎస్‌) పని చేయకపోవడంతో ఇప్పటివరకు 20 శాతం మంది ఉపాధ్యాయులు కూడా తమ వివరాలను అప్‌డేట్‌ చేయలేకపోయారు. మరోవైపు వెబ్‌సైట్‌లోకి వెళితే ఆరు నెలల క్రితం నమోదు చేసిన అంశాలు కూడా ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో పాత వివరాలతోపాటు తాజా వివరాలను సైతం నమోదు చేద్దామంటే వెబ్‌సైట్‌ పనిచేయడం లేదని, సమస్యను పరిష్కరించి తమకు మరికొంత గడువు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 

పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని టీచర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం (టీఐఎస్‌)లో రాష్ట్రంలోని 1.87 లక్షల మంది ఉపాధ్యాయులు తమ సర్వీస్, విద్యార్హతలు, ఇప్పటి వరకు పొందిన పదోన్నతులు, బదిలీలు వంటి 136 వివరాలను నమోదు చేయాలి. అలాగే డిపార్ట్‌మెంటల్‌ టెస్టుల వివరాలను గెజిట్‌ నంబర్లతో సహా నమోదు చేయాలి. వీటి ఆధారంగానే వచ్చే ఏడాది పదోన్నతులు, బదిలీలు చేపడతారు. ఈ క్రమంలో తమ వివరాలు నమోదుకు మరికొంత గడువు పెంచాలని కోరుతున్నారు.  

సర్వర్‌ సామర్థ్యం పెంచాలి 
సాంకేతిక సమస్యలతో పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని టీచర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం (టీఐఎస్‌) పనిచేయడం లేదని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్విసు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు వీలుగా టీఐఎస్‌ సర్వర్‌ సామర్థ్యాన్ని పెంచాలని విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఒకేసారి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేందుకు సన్నద్ధం కావడంతో సంబంధిత టైటిల్స్‌ తెరుచుకోవడం లేదన్నారు. ఒకవేళ వెబ్‌సైట్‌ తెరుచుకున్నా గతంలో నింపిన వివరాలు తొలగిపోకుండా చూడాలని కోరారు. టీచర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం కెపాసిటీని పెంచి వివరాల నమోదుకు గడువు పొడిగించాలని, అలాగే మొబైల్‌ వెర్షన్‌ కూడా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)