Breaking News

‘వందేభారత్‌’లో సాంకేతిక లోపం

Published on Fri, 08/18/2023 - 03:28

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ: విశాఖలో గురువారం బయల్దేరాల్సిన విశాఖ–సికింద్రాబాద్‌ (20833) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు రైలుని రద్దు చేసి మరో రైలులో ప్రయాణికులను సికింద్రాబాద్‌కు పంపారు. డీఆర్‌ఎం సౌరభ్‌ప్రసాద్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విశాఖ నుంచి ఈ స్పెషల్‌ రైలు ఏర్పాటు చేశారు.

ఈ రైలు విశాఖలో ఉదయం 7 గంటలకు బయల్దేరింది. వందేభారత్‌ మార్గంలో అదే హాల్ట్స్‌తో ఈ రైలు సికింద్రాబాద్‌ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్పెషల్‌ రైలు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో అదే హాల్ట్స్‌తో విశాఖ చేరుకోనుంది. కాగా, వందే భారత్‌ రద్దు చేయడంపై అన్ని రైల్వే స్టేషన్‌ల్లో ప్రకటనలు, మెసేజ్‌ల ద్వారా ప్రయాణికులకు సమాచారమిచ్చి,

ప్రతి రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణం రద్దు చేసుకున్న వారికి పూర్తిగా నగదు రిఫండ్‌ చేశారు. ప్రత్యేక రైలులో ప్రయాణం చేసిన ప్రయాణికులకు వ్యత్యాసం నగదు రిఫండ్‌ చేశారు. ఈ రైలులో వందే భారత్‌ రైలు సేవలతో సమానంగా క్యాటరింగ్‌ ఏర్పాట్లు కూడా చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)