అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా.. : ఎమ్మెల్యే గుమ్మనూరు

Published on Thu, 01/30/2025 - 05:19

సాక్షి ప్రతినిధి, అనంతపురం/గుంతకల్లు: పత్రికల్లో ఇష్టమొచ్చినట్టు రాసుకుంటూ వెళితే రైలు పట్టాల­పై పడుకోబెడతానని అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ పాత్రికేయులను హెచ్చరించారు. గుంతకల్లులో టీడీపీ ప్రతినిధుల సమక్షంలో ఆయన మాట్లాడిన వీడియో టేపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

ఇటీవల ఒక టీవీ చానల్‌ (సాక్షి టీవీ కాదు)­లో గుమ్మనూరు జయరాం సోదరులు రైలు పట్టాల­పై పడుకోబెట్టి చంపుతున్నారన్నట్టుగా వార్తలొచ్చాయని, వాటిని నిరూపించాలని అన్నారు. తనకు మీడియా అంటే లెక్కలేదని, ఏదైనా అతిగా రాస్తే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ‘నేను అన్నీ చేసి వచ్చాను. ఇది నాకు పెద్ద లెక్క కాదు’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 

తన సోదరులు రాజకీయ పెత్తనం చేస్తున్నారని చాలామంది అంటున్నారని, అవసరమైతే వారిని పక్కనపెట్టి తానే రాజకీయం చేస్తానని అన్నారు. తనపై వార్తలు రాస్తే తాట తీస్తానని వార్నింగ్‌ ఇచ్చా­రు. తనపై కొంతమంది పనిగట్టుకుని వ్యతి­రేక వార్తలు రాస్తున్నారని, వాటిని నిరూపించలేకపోతే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని అన్నారు. తాను ఫ్రెండ్లీగానే అడుగుతున్నానని, ఏదైనా రాసేట్ట­యితే చెప్పండని, తాను వెళ్లిపోయాక ఏవేవో రాయొద్దని అన్నారు. 

బుధవారం సాయంత్రం గుంతకల్లులో మీడియాతో మాట్లాడుతూ.. తనపై మీడి­యా చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని, రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానంటూ ప్రసారాలు చేయడం కరెక్ట్‌ కాదని అన్నారు. ఇలాంటి ప్రసారాలను చేస్తే ఇదే తరహాలో ప్రవ­ర్తించాల్సి వస్తుందని మీడియాకు వార్నింగ్‌ ఇచ్చారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)