Breaking News

సాక్షి కార్యాలయాల వద్ద పచ్చ మూకల విధ్వంసం

Published on Wed, 06/11/2025 - 05:57

రాజానగరం/ఏలూరు/ఏలూరు టౌన్‌: సాక్షి కార్యాలయాల వద్ద కూటమి మూకల విధ్వంసకాండ కొనసాగుతోంది. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంతోపాటు ఏలూరులోని ప్రాంతీయ కార్యాలయం వద్ద కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రౌడీ మూకలు బీభత్సం సృష్టించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంపైకి రాజానగరం, అనపర్తి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ (జనసేన పార్టీ), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ), అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుల ఆధ్వర్యాన ముష్క­రులు దాడికి తెగబడ్డారు.

ప్రధాన గేటు ముంగిట సాక్షి పత్రికలను వేసి దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, సాక్షి మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి నేమ్‌ బోర్డును పెకలించారు. అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, సాక్షి కార్యాలయాలపై కూటమి నేతల దాడులను అరికట్టాలని కోరుతూ తూర్పు గోదావరి, కాకినాడ ఎస్పీలు నరసింహ కిషోర్, బిందుమాధవ్‌లకు మీడియా ప్రతినిధులు వినతిపత్రాలు అందించారు.

ఫర్నిచర్‌ తగులబెట్టి భీతావహ వాతావరణం  
ఏలూరు ఎన్‌ఆర్‌ పేటలోని ‘సాక్షి’ ప్రాంతీయ కార్యాలయం వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన 500 మందికిపైగా టీడీపీ గూండాలు భీతావహ వాతావరణం సృష్టించారు. కార్యాలయం వద్ద ఫరి్నచర్‌ను పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. భారీగా మంటలు చెలరేగటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తొలుత కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు ముష్క­రులు యతి్నంచారు. కార్యాలయం ఆవరణలో కింద ఉన్న ఫరి్నచర్‌పై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు, కార్యకర్తలు ఏప్రిల్‌ 22న కూడా ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

సాక్షి కార్యాలయాలపై దాడులు హేయం 
టీడీపీ ప్రభుత్వం సాక్షి మీడియా గ్రూప్‌ టార్గెట్‌గా చేస్తున్న పనులు అత్యంత హేయం. అమరావతి మహిళల పేరుతో తొలుత సాక్షి మీడియా ఆఫీసులపై దాడి చేసిన పచ్చమూకలు... మరో అడుగు ముందుకేసి, ఏలూరు సాక్షి కార్యాలయంపై పెట్రోల్‌ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసి ఫరి్నచర్‌కు నిప్పు పెట్టడం దుర్మార్గం. ఈ అనైతిక చర్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. అక్రమ కేసుతో సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం దారుణం.   
– కురసాల కన్నబాబు,వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి

పథకం ప్రకారమే దాడులు
సాక్షి కార్యాలయాలపై మూడు రోజులుగా పథకం ప్రకారం టీడీపీ ముష్క­రులు దాడులు చేస్తున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయం ఆవరణలోని ఫర్నిచర్‌కు నిప్పుపెట్టడం దుర్మార్గం. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే. హింసాత్మక చర్యలు భవిష్యత్‌లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి. దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరు. ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్రమ కేసులో కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నా.      
– బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో విపక్ష నేత

కూటమి అరాచకాలు పతాకస్థాయికి  
ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి.  ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం దారుణం. టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి ఈ అరాచకాలకు తెగబడుతున్నాయి. ఏలూరు సాక్షి ఆఫీసులోని ఫర్నిచర్‌ తగులబెట్టడం అత్యంత దారుణం.      
– గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)