Breaking News

ఆహ.. ఏమి రుచి!

Published on Tue, 01/14/2025 - 04:07

సాక్షి, అమరావతి: భారతీయ వంటకాలు ప్రపంచ ఆహార ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచస్థాయి వంటకాలు, ఐకానిక్‌ రెస్టారెంట్‌ల క్యూరేటెడ్‌ జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. టేస్ట్‌ అట్లాస్‌ ఇటీవల 2024–25 ప్రపంచ ఆహార అవార్డులను ప్రకటించింది. ఇందులో భారతీయ వంటకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. సంప్రదాయం, రుచుల్ని మిళితం చేసే భారతదేశం పాకశాస్త్ర సంస్కృతికి అద్దం పట్టాయి. భారతీయ వంటకాలు సుగంధ ద్రవ్యాలతో కూడినవని విమర్శకులు పేర్కొన్నప్పటికీ.. ప్రపంచంలోని అత్యంత ఇష్టపడే వంటకాల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. మొఘల్, పంజాబీ, దక్షిణాది వంటకాల రుచి అనేక రెస్టారెంట్లకు సైతం ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చాయి.

దక్షిణాదిలో దోశ.. ఉప్మా రెస్టారెంట్‌ 
టేస్ట్‌ అట్లాస్‌ 100 మోస్ట్‌ లెజెండరీ రెస్టారెంట్లలో ఐకానిక్‌ వంటకాలు, గొప్ప వంటలో భారతీయ ఆహార మార్కెట్‌ సత్తా చాటింది. కలకత్తాలోని పీటర్‌ క్యాట్‌ రెస్టారెంట్‌కు 7వ ర్యాంక్‌ రాగా.. ఇక్కడ దొరికే ‘చెలో కబాబ్‌’కు ఆదరణ లభిస్తోంది. ముర్తల్లోని అమ్రిక్‌ సుఖ్‌దేవ్‌ రెస్టారెంట్‌కు 13వ ర్యాంక్‌లో ఆలూ పరాటా అందిస్తూ ఆకట్టుకుంటోంది. న్యూఢిల్లీలోని కరీం రెస్టారెంట్‌ 1,913 నుంచి కోర్మా వంటకం ద్వారా భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది.

దీనికి 59వ ర్యాంక్‌ రావడం విశేషం. బెంగళూరులోని సెంట్రల్‌ టిఫిన్‌ రూమ్‌ మసాలా దోశ మంచి క్రేజ్‌ సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా 69వ ర్యాంక్‌లో నిలిచింది. న్యూఢిల్లీలోని గులాటి రెస్టారెంట్‌ 77 ర్యాంక్‌తో బట్టర్‌ చికెన్‌.. ముంబైలోని రామ్‌ ఆశ్రమం ఉప్మాకు 78వ ర్యాంక్‌ సంపాదించింది.

హైదరాబాద్‌ బిర్యానీ అదుర్స్‌ 
ఫుడ్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాను వెల్లడించింది. భారత్‌ నుంచి ముర్గ్‌ మఖానీ 29వ, హైదరాబాద్‌ బిర్యానీ 31 స్థానాల్లో నిలిచాయి. చికెన్‌–65 సైతం 97వ స్థానంలో, కీమా 100వ స్థానం పొందాయి. ముర్గ్‌ మఖానీ, హైదరాబాద్‌ బిర్యానీ గ్లోబల్‌ ఆహార ప్రియుల నుంచి వరుసగా 5, 4.52 స్టార్‌ రేటింగ్‌ అందుకున్నాయి. మరోవైపు చికెన్‌ 65, కీమాకు 4.44 స్టార్‌ రేటింగ్‌ వచ్చింది.

కొలంబియా లెచోనా.. ఇటలీ పిజ్జా 
టేస్ట్‌ అట్లాస్‌ ర్యాంకింగ్‌లో కొలంబియాకు చెందిన లెచోనా (పోర్క్‌) వంటకం 4.78 రేటింగ్‌తో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానంలో ఇటలీకి చెందిన పిజ్జా 4.75 రేటింగ్‌తో రెండో స్థానంలో, బ్రెజిల్‌కు చెందిన పికాన్హా 4.69 రేటింగ్‌తో మూడో స్థానం, ఆ తరువాత స్థానాల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఫనాంగ్‌ కర్రీ, అర్జెంటీనాకు చెందిన అసడో వంటకాలు 4.65 రేటింగ్‌ను పొందాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)