Breaking News

‘సర్వే’శా.. ‘యోగే’శా..!

Published on Sat, 05/24/2025 - 03:24

సాక్షి, అమరావతి: యోగా డే సందర్భంగా విశాఖలో జరిగే కార్యక్రమానికి జన సమీకరణ కోసం సర్కారు ప్రత్యేక సర్వే చేపట్టింది. యోగాంధ్ర పేరుతో ఈ సర్వేను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తోంది. దీంతో ఉద్యోగులు రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి జూన్‌ 21న యోగాడే కార్యక్రమానికి విశాఖపట్నం వస్తారా అంటూ ఆరా తీస్తున్నారు. సీఎం చంద్రబాబు మూడు రోజుల క్రితం విలేకరుల  సమావేశం ఏర్పాటు చేసి.. వచ్చే జూన్‌ 21న విశాఖపట్నంలో రికార్డు స్థాయిలో ఐదు లక్షల మందితో యోగాడే వేడుకలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచి్చంది. 

సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి యోగాడేలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నారా? లేదా? అని ప్రశ్నించాలి. వారిచ్చే జవాబు ఆధారంగా యాప్‌లో ఎస్‌ అనో లేదా నో అనో నమోదు చేయాలి. ఎస్‌ అని నమోదు చేసిన వెంటనే విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొంటారా.. లేదంటే సొంత ప్రాంతంలో పాల్గొంటారా.. ఇతర ప్రాంతాల్లో పాల్గొంటారా.. అనే ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి. వాటి ఆధారంగా వివరాలు నమోదు చేసి సచివాలయ ఉద్యోగులు సబ్మిట్‌ చేయాలి. యోగా వేడు­కల్లో పాల్గొనదలచిన వ్యక్తి ఫోన్‌ నంబరుకు వచ్చిన ఓటీపీ కూడా నమోదు చేస్తే సర్వే పూర్తయినట్టు.  

సర్వేలతోనే సరి! 
గత ప్రభుత్వ పాలనలో  ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. ప్రభుత్వానికి ఏ సమాచారం కావాలన్నా.. వారు సేకరించి ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో ఇప్పుడు వలంటీర్ల పనిభారం అంతా సచివాలయ ఉద్యోగులపై పడింది. 

సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయకపోయినా కూటమి సర్కారు ఆ వివరాలు తీసుకోండి.. ఈ వివరాలు కావాలి అంటూ సర్వేల పేరుతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తోంది. గత ఆరేడునెలల్లోనే ప్రభుత్వం దాదాపు 15–16 సర్వేలు చేయించినట్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ సమాచారం కోసం ప్రజల వద్దకు వెళ్తుంటే వారూ అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)