Breaking News

ఉద్రిక్తత నడుమ బుగ్గమఠం భూముల సర్వే

Published on Sun, 05/04/2025 - 05:02

తిరుపతి మంగళం: తిరుపతిలోని బుగ్గమఠం భూముల సర్వే ఉద్రిక్తతల మధ్య సాగింది. భూముల హక్కుదారులు సర్వేను అడ్డుకునే ప్రయ­త్నం చేయగా.. పోలీసు బందోబస్తు నడుమ అధికారులు సర్వే ముగించారు. తిరుపతి మారుతీనగర్‌­లోని బుగ్గమఠం భూములలో శనివారం తప్పుడు నోటీసులతో దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ సర్వే అధికారులు పోలీసు బలగాలతో సర్వే చేసేందుకు సిద్ధపడ్డారు. వందేళ్లుగా పట్టం వెంకట్రాయులు ఆ«దీనంలో ఉన్న బుగ్గమఠం భూములకు సంబంధించి 35 ఏళ్ల క్రితమే భూముల క్రయ విక్రయాలు జరుపుకొనేందుకు కోర్టు అనుమతి కూడా ఇచ్చిందని వెంకట్రాయులు కుమారులు, మనవళ్లతో­పాటు ఇతర హక్కుదారులు డేగల మునికుమార్, ఎన్‌.యశోదమ్మ, పురంధర్, డేగల మునిరాజమ్మ, పట్టెం మునిప్రభాకర్‌ తెలిపారు.

ఇప్పుడు అకస్మాత్తుగా సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని భూ హక్కుదారులు అధికారులను ప్రశ్నించారు. ఒకవేళ సర్వే నిర్వహించాలన్నా ఆ భూములకు సంబంధించిన 9 మంది హక్కుదారులకు ముందస్తు నోటీసులు జారీ చేశాక సర్వే నిర్వహించాలి కదా... అని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి హఠాత్తుగా వచ్చి ఒకరు, ఇద్దరికి నోటీసులు ఇవ్వడం ఏమిటని, అందులో ఈ నెల 3వ తేదీన సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొని ఆ నోటీసును గత నెల 24న ఇచి్చనట్లుగా చెప్పడం చూస్తే.. వారు తప్పుడు నోటీసులు ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు.

న్యాయబద్ధంగా సర్వే నిర్వహించాలనుకుంటే భూ హక్కుదారులందరికీ 10 రోజులముందే నోటీసులు జారీచేసి అందరి సమక్షంలో సర్వే చేయాలన్నారు. అలాకాకుండా అర్ధంతరంగా వచ్చి బుగ్గమఠం భూముల సర్వే చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ అధికారులు పోలీసుల బలగాలతో వచ్చి ఏకపక్షంగా సర్వే 
నిర్వహించారు.  

భూ హక్కుదారులను పక్కకు నెట్టేసి సర్వేకు అడ్డురావొద్దని హెచ్చరిస్తున్న డీఎస్పీ భక్తవత్సలం
ఇప్పుడు అకస్మాత్తుగా సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని భూ హక్కుదారులు అధికారులను ప్రశ్నించారు. ఒకవేళ సర్వే నిర్వహించాలన్నా ఆ భూములకు సంబంధించిన 9 మంది హక్కుదారులకు ముందస్తు నోటీసులు జారీ చేశాక సర్వే నిర్వహించాలి కదా... అని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి హఠాత్తుగా వచ్చి ఒకరు, ఇద్దరికి నోటీసులు ఇవ్వడం ఏమిటని, అందులో ఈ నెల 3వ తేదీన సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొని ఆ నోటీసును గత నెల 24న ఇచి్చనట్లుగా చెప్పడం చూస్తే.. వారు తప్పుడు నోటీసులు ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు. 

న్యాయబద్ధంగా సర్వే నిర్వహించాలనుకుంటే భూ హక్కుదారులందరికీ 10 రోజులముందే నోటీసులు జారీచేసి అందరి సమక్షంలో సర్వే చేయాలన్నారు. అలాకాకుండా అర్ధంతరంగా వచ్చి బుగ్గమఠం భూముల సర్వే చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ అధికారులు పోలీసుల బలగాలతో వచ్చి ఏకపక్షంగా సర్వే నిర్వహించారు. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)