మరో 36 స్పెషల్‌ ట్రైన్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Published on Tue, 04/29/2025 - 20:26

విజయవాడ: విజయవాడ మీదుగా చర్లపల్లి–కాకినాడ టౌన్, చర్లపల్లి–నర్సాపూర్‌ మధ్య మరో 36 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి–కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07031) మే 2 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) మే 4 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగుతుంది. 

చర్లపల్లి–నర్సాపూర్‌ ప్రత్యేక రైలు..
చర్లపల్లి–నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (07233) మే 2 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మే 4 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్‌లలో ఆగుతుంది.  

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)