Breaking News

కులం కాటుకు ఎంటెక్‌ విద్యార్థిని బలి

Published on Mon, 12/08/2025 - 03:47

ఒంగోలు టౌన్‌: కులం కాటుకు మరో యువతి బలైంది. ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డయింది. దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి సూసైడ్‌ నోట్‌ ప్రకారం వివరాలివీ.. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంకు చెందిన మైరాల నళిని, మహేంద్ర నగర్‌కు చెందిన సింగోలు శ్రీనివాస్‌ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని  మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. 

నీవు లేకపోతే బతకలేనని చెప్పిన శ్రీనివాస్‌ నళినిని అన్ని విధాలా వాడుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. నీ కులం వేరు నా కులం వేరు.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడంలేదంటూ ఫోన్‌ కట్‌ చేయడం మొదలుపెట్టాడు. దీంతో శ్రీనివాస్‌తో మాట్లాడదామని శనివారం అతడి ఇంటికి వెళ్లింది. ‘శ్రీనివాస్‌ మాలలో ఉన్నాడు.. ఇంట్లోకి రావద్ద’ని అతని తల్లిదండ్రులు నళినిని బయట నుంచే పంపించేయడంతో ఇక శ్రీనివాస్‌తో తన పెళ్లి జరగదని ఆందోళనకు గురైన నళిని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింది. 

ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ చూపరులను కలచివేస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన నళిని ఎంటెక్‌ చదివింది. తండ్రి దేవదానానికి నలుగురు ఆడపిల్లలు ఉండగా వారిలో ముగ్గురికి వివాహమైంది. నళిని మూడో సంతానం. వన్‌ టౌన్‌ సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. దళిత హక్కుల సంఘం నాయకులు నీలం నాగేంద్రం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. నళిని మృతికి కారణమైన శ్రీనివాస్‌ మీద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)