Breaking News

డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌.. రాష్ట్రంలో ఎక్కడా కోత లేదు

Published on Thu, 06/29/2023 - 04:16

సాక్షి, అమరావతి: ప్రభుత్వ హామీ మేరకు రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరా జరుగుతోందని, ఎక్కడా విద్యుత్‌ కోతలు విధించడంలేదని ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ ట్రాన్స్‌కో) బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఈ నెల 24న 206.62 మిలియన్‌ యూనిట్లు, 25న 197.19 మిలియన్‌ యూనిట్లు, 26న 201.97 మిలియన్‌ యూనిట్లు చొప్పున ఎలాంటి విద్యుత్‌ లోటు, లోడ్‌ రిలీఫ్‌లు లేకుండా అందించాయని తెలిపింది.

ఈ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీజెన్‌కో) థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు సగటున రోజుకు 80 మిలియన్‌ యూనిట్లు అందించాయని వెల్లడించింది. 27వ తేదీ వరకు సగటు విద్యుత్‌ ఎగుమతి (అమ్మకాలు) రోజుకు 1.36 మిలియన్‌ యూనిట్లు మాత్రమేనని పేర్కొంది.

అందువల్ల సరఫరా – డిమాండ్‌ గ్యాప్‌ కారణంగా లోడ్‌ రిలీఫ్‌లు లేవని,  గ్రిడ్‌ డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను డిస్కంలు సమకూర్చుకుంటున్నాయని తెలిపింది. విద్యుత్‌ కొరత తీర్చడానికి ఎప్పటికప్పుడు బహిరంగ మార్కెట్‌ (ఎనర్జీ ఎక్సే్చజీలు) నుంచి కొని, రాష్ట్రంలోని వినియోగదారులకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయని వివరించింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)