Breaking News

భార్యా భర్తలను కలిపిన లోక్‌ అదాలత్‌

Published on Sun, 09/15/2024 - 05:41

సాక్షి, అమరావతి :  విభేదాల కారణంగా విడివి­డిగా ఉంటున్న భార్యా భర్తలను జాతీయ లోక్‌ అదాలత్‌ కలిపింది. ఇందుకు గాను వారిద్దరినీ హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌ అభినందించారు.  ఈ భార్య భర్తలు విజయవా­డకు చెందిన వారు. వీరికి 2008లో వివాహమైంది. 

ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య 2022లో పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసులో వారు రాజీపడి కలిసి ఉండేందుకు సిద్ధపడ్డారు. 

రాష్ట్రవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లు 
శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా హైకోర్టుతో సహా రాష్ట్రంలోని అన్ని న్యాయ­స్థానాల్లో లోక్‌ అదాలత్‌లు నిర్వహించారు. జస్టిస్‌ నరేందర్‌ హైకోర్టు ప్రాంగణం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విజయవాడ, మచిలీç­­³ట్నం న్యాయస్థా­నాల్లో జరిగిన లోక్‌ అదా­లత్‌లను స్వయంగా పరిశీలించారు. హైకోర్టులో న్యాయ­మూర్తులు జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్, జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో లోక్‌ అదాలత్‌ జరగ్గా.. 175 కేసులు పరిష్కారమ­య్యాయి. 

రూ.2.90 కోట్ల మేర పరిహారాన్ని అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 377 లోక్‌ అదాలత్‌లు నిర్వహించారు. మొత్తం 45,898 కేసులు పరిష్కారం కాగా, రూ.64.72 కోట్లు పరిహారంగా చెల్లించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన పోషకులు జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సేవాధి­కార సంస్థ రాష్ట్ర కార్యదర్శి బబిత తెలిపారు.    

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)