Breaking News

రైతుబజార్లలో సబ్సిడీ టమాటా

Published on Sat, 07/01/2023 - 03:30

సాక్షి, అమరావతి: చుక్కలనంటుతున్న టమాటా ధరల నుంచి వినియోగదారులకు ఊరట లభి­స్తోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.100 దాటింది. దీంతో ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీం కింద రైతుల నుంచి టమాటాను సేకరించి కిలో రూ.50 చొప్పున సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందిస్తోంది. తొలుత కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లోని రైతుబజార్లలో సబ్సిడీ టమాటా విక్రయాలు ప్రారంభించగా.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరా­లు, పట్టణాల్లోని రైతుబజార్లలో అందుబాటులోకి తీసు­కొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికభా­రమైనప్పటికీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లి, పలమనేరు తదితర మార్కెట్లలో రైతుల నుంచి కిలో రూ.98 నుంచి రూ.104 చొప్పున చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇలా గడిచిన నాలుగు రోజుల్లో 95 టన్నులు సేకరించారు. శుక్రవారం 36 టన్నులు సేకరించి.. బహిరంగ మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్న విశాఖపట్నం జిల్లాకు 20 టన్నులు, ఎన్టీఆర్‌ జిల్లాకు ఆరు, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఐదేసి టన్నుల చొప్పున తరలించి స్థానిక రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున విక్రయించారు.

శనివారం నుంచి రోజు 50 టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నాలుగైదు రోజులు విశాఖ, తూర్పు­గోదా­వరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలకు స్థానిక అవసరాలకు తగినట్లు టమాటా నిల్వలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులతో కూడిన బృందాల ద్వారా తనిఖీలకు శ్రీకారం చుడుతోంది. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలను సీఎం యాప్‌ద్వారా నిత్యం సమీక్షిస్తూ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)