Breaking News

ట్రిబ్యునల్‌ అంచనా కంటే అధికంగా వంశధార

Published on Fri, 10/18/2024 - 05:58

వంశధారలో ఏటా సగటున 166 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. నదీ పరీవాహక ప్రాంతంలో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసు­కుని వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల అధ్యయనం చేసింది. 

వంశధార ట్రిబ్యునల్‌ 2017లో బేసిన్‌లో 115 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. ట్రిబ్యునల్‌ తేల్చిన దానికంటే వంశధారలో లభ్యత 51 టీఎంసీలు అధికంగా ఉన్నట్టు సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైంది. వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  - సాక్షి, అమరావతి

సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలివీ..
వంశధార బేసిన్‌లో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్లలో సగటున ఏటా 1,342 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 498.02 టీఎంసీలు

బేసిన్‌లోని జలాశయాల్లో ఏటా ఆవిరి నష్టాలు సగటున 1.06 టీఎంసీలు

తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, జంతువులకు తాగునీటి అవసరాల కోసం 2022–03లో 0.71 టీఎంసీలు వినియోగించుకున్నారు  

వంశధార ప్రస్థానం ఇదీ.. 
జన్మస్థానం: ఒడిశాలో ఉమ్మడి పూల్‌భణి             జిల్లాలో బెలగడ్‌ వద్ద సముద్ర             మట్టానికి 600 మీటర్ల ఎత్తులో 
ఒడిశాలో ప్రవాహ మార్గం: కంధమాల్, కలహండి, రాయగడ, గజపతి జిల్లాల్లో 125 కి.మీ.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాహ మార్గం:   విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 96 కి.మీ. 
సముద్ర సంగమం: కళింగపట్నం వద్ద  బంగాళాఖాతంలో  
వంశధార బేసిన్‌ పరిధి: మొత్తం 10,504 చదరపు కిలోమీటర్ల వైశాల్యం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)