Breaking News

పీఎస్‌ఎల్‌వీ సీ61 వైఫల్యంపై అధ్యయనం

Published on Sat, 05/31/2025 - 04:39

సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు బ్రహ్మస్త్రం లాంటి పీఎస్‌ఎల్‌వీ సీ61 రాకెట్‌ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను తెలుసుకునేందుకు జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీ అధ్యయనం ప్రారంభించింది. ఈ ప్రయోగం ప్రారంభమైన ఏడు నిమిషాల్లోపే మూడో దశ గతి తప్పి మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ కట్‌ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దీని వైఫల్యానికి కారణమేంటి? రాకెట్‌లోని మూడోదశ ఎందుకు మొరాయించింది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇస్రో దృష్టిసారించింది. 

ఇందుకోసం జాతీయ స్థాయిలో నిపుణులతో కూడిన ఓ విశ్లేషణ కమిటీని ఏర్పాటుచేసింది. ఇది ప్రయోగం వైఫల్యంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి జూన్‌ రెండో వారంలో నివేదికను సమర్పిస్తుంది. ఇప్పటికే విశ్లేషణకు అవసరమైన పూర్తి డేటాను ఇస్రో ఈ  కమిటీకి అందజేసింది. ఈ కమిటీ నివేదిక ఇచి్చన తరువాతే తదుపరి ప్రయోగాలపై నిర్ణయం తీసుకుంటామని ఇస్రో తెలిపింది.   

నిసార్‌ ఉపగ్రహ ప్రయోగం జూలైకి వాయిదా.. 
ఇక పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం విఫలం కావడంతో ఈనెల నుంచి వరుసగా చేయాలనుకున్న అన్ని ప్రయోగాలూ వాయిదాపడ్డాయి. దీంతో జూన్‌ రెండు లేదా మూడో వారంలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌16 ప్రయోగం ద్వారా ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్‌ ఉపగ్రహ ప్రయోగాన్ని జూలై మూడో వారానికి వాయిదా వేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.   

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)